Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ సాహో స్టోరి ఇదే... డార్లింగ్ ఫ్యాన్సుకు పూనకాలే...

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (21:30 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ‘సాహో’. దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ భారీ క్రేజీ మూవీని ఆగస్టు 30న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. అయితే... ఈ సినిమాపై పెద్ద ఎత్తున వార్తలే కాదు.. పుకార్లు సైతం వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్, శ్రద్దా రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తలు ఓ రేంజ్‌లో హల్ చల్ చేయగా.. తాజాగా ‘సాహో’లో పెద్ద ట్విస్ట్ ఇదే.. సాహో కథ ఇదే అంటూ పుకార్లు చెలరేగాయి. 
 
ఇందులో నిజానిజాలు ఏ మాత్రం ఉన్నాయోగానీ మీడియాలో పుంకానుపుంకాలుగా కథనాలు మాత్రం వస్తున్నాయి. అసలు విషయానికొస్తే.. ‘సాహో’ ట్రైలర్‌లోనే రూ. 2 వేల కోట్ల దోపిడికి సంబంధించిన కేసును ఛేదించే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించిన విషయం విదితమే. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు పెద్ద ట్విస్ట్ ఉందని తెలుస్తోంది. ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్ కనిపించబోతున్నాడట. 
 
ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..? కాదా..? అని. 
సినిమా రిలీజ్‌కు సమయం కూడా దగ్గరపడటంతో ఈ సీక్రెట్‌ను చాలా జాగ్రత్తగా చిత్ర బృందం మెయింటైన్ చేస్తోందట. సినిమా మొత్తానికి ఇదే అసలు సిసలైన ట్విస్ట్ కావడంతో చిత్ర బృందం కూడా అధికారికంగా స్పందించలేదని సమాచారం.

ఒకవేళ ప్రభాస్‌ నిజంగానే డ్యూయల్ రోల్‌లో కనిపిస్తే మాత్రం డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆగస్టు 30 వరకు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కదులుతున్న అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments