రీ- రిలీజ్ లు లాభమా? నష్టమా? ట్రెండ్ మారబోతోందా!

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (20:57 IST)
theatre
ఈమధ్య అ్రగహీరోల సినిమాలు రిరిలీజ్ లు చేయడం ఆనవాయితీగా మారింది. ఎవరో ఒకరు తమ హీరో సినిమాను రిరిలీజ్ చేయగానే బాగా థియేటర్లలో ఆదరణ రావడంతో మరి కొందరు హీరోస్  అందుకు ముందుకు వచ్చాడు. తర్వాత తర్వాత పలానా హీరో పుట్టిన రోజు సందర్భంగానో సినిమా రిలీజ్ అయి ఇన్ని సంవత్సరాలు అయిన సందర్భంగా అగ్రహీరోలు తమ సినిమాలను మరలా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో పవన్ కళ్యాన్ సినిమా కూడా వుండడం, అధి కాస్తో కూస్తో డబ్బులు రావడం జరిగింది.
 
కానీ ఆ తర్వాత చిరంజీవి సినిమాకానీ, మహేష్ బాబు సినిమా కానీ, ప్రభాస్ సినిమా కానీ రి రిలీజ్ చేస్తే పెద్దగా ఆదరణ లేదు. అప్పటికే ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టడం, దాని వల్ల ఏదో ఉపయోగం అయిందనుకున్నా వ్రుధా ప్రయాస అయిందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు 4డి లో విడుదలై కాస్తో కూస్తో డబ్బులు రాబట్టింది.
 
ఇప్పటికే ఆయా హీరోల సినిమాలు పలుసార్లు టీవీల్లో రావడం వల్ల కావచ్చు. చూసిన సినిమానే మరలా డబ్బు పెట్టి చూడ్డం ఎందుకనుకున్నారో ఒకటి రెండు హీరోల సినిమాల మినహా పెద్దగా ఆదరణ లభించలేదని ఎగ్జిబిటర్లు కూడా తెలియజేస్తున్నారు. పరిమితంగా కొన్ని థియేటర్లలో విడుదల చేయడం అందుకు ఫ్యాన్స్ హంగామా చేయడం మినహా థియేటర్ యాజమాన్యానికి ఒరిగింది లేదని తెలుస్తోంది. 
 
రిరిలీజ్ సినిమాలు విడుదల ట్రెండ్ నడుస్తున్నప్పుడు సరైన సినిమాలు థియేటర్లలో రాకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని ఎగ్జిబిటర్లు తెలియజేస్తున్నారు. సో.. ఇకపై రి రిలీజ్ సినిమాలు ట్రెోండ్ కు ఫుల్ స్టాప్ పడుతుందో మో చూడాలి. తాజాగా రజనీకాంత్ ముత్తు సినిమా విడుదల కాబోతుంది. బాలక్రిష్ణ సినిమా ఆ మధ్య రిలీజ్ అయితే పెద్దగా చూసిన వారు లేరు. కనుక ఈ ట్రెండ్ ఎంత కాలం వుంటుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments