Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా రేటు రూ.2 కోట్లు? ఎవరు ముందొస్తే వారికే ఫస్ట్ ఛాన్సంటున్న జిగేల్ రాణి

Webdunia
బుధవారం, 29 జులై 2020 (14:34 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ ముహూర్తాన పాదం మోపిందోగానీ పూజా హెగ్డే దశ తిరిగిపోయింది. ఒక వైపు హీరోయిన్ పాత్రలతో పాటు... మరోవైపు ఐటమ్ సాంగులతో రెచ్చిపోతోంది. స్పష్టంగా చెప్పాలంటే... ఆమె ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే రాంచరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన "రంగస్థలం" చిత్రంలోని ఐటమ్ సాంగ్ మరో ఎత్తు. ఈ పాటలో పూజా హెగ్డే ఇరగదీసింది. 
 
ఆ తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రిన్స్ మహేష్ బాబుతో 'మహర్షి', తాజాగా అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో' చిత్రాలు చేసింది. ఈ రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ మూవీలు. దీంతో ఈ అమ్మడు ఫేట్ మారిపోయింది. ముఖ్యంగా తన పారితోషికాన్ని ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసింది. ఈ అమ్మడు రెమ్యునరేషన్‌ను భారీ చిత్రాల నిర్మాతలు మాత్రమే భరించే స్థితిలో వున్నారు. 
 
పైగా, పూజాకు తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ ఉండడంతో ఆమె డేట్స్ దొరకడం గగనంగా మారిపోయింది. ఆ మధ్య వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రానికి ముందు పూజ కోటి రూపాయల వరకుతీసుకునేది. ఆ సినిమాకు రూ.1.4 కోట్ల వరకు తీసుకుందని వినికిడి. 
 
ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు తన పారితోషికాన్ని ఒక్కసారిగా రెండు కోట్లకు పెంచేసిందట. ఈ రేటు విషయంలో నో కాంప్రమైజ్ అంటోంది. అయినప్పటికీ, ఆమెకున్న క్రేజ్‌ను బట్టి పూజను బుక్ చేయడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు మరి! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments