Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హేగ్దే రేటు తెలిస్తే గుడ్లు తేలేస్తారు... ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (20:50 IST)
టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ పూజా హేగ్డే. ప్ర‌భాస్, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీ... ఇలా టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టిస్తూ... ఫుల్ బిజీగా ఉంది. దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు ఈ అమ్మ‌డుకి ఎంత క్రేజ్ ఉందో. ఇదిలా ఉంటే... అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. జి.ఎ 2 పిక్చ‌ర్స్‌ ఈ చిత్రాన్ని
నిర్మిస్తుంది.
 
ఈ సినిమా హీరోయిన్ విష‌యంలో ఎట్ట‌కేల‌కు ఓ క్లారిటీ వ‌చ్చింద‌ని వినికిడి. కొన్ని రోజుల క్రితం పూజా హెగ్డేని హీరోయిన్‌గా తీసుకుంటార‌ని వార్త‌లు వినిపించాయి. రీసెంట్‌గా పూజా హెగ్డే భారీ రెమ్యురేష‌న్ డిమాండ్ చేయ‌డంతో ఆమె స్థానంలో కేతికా శ‌ర్మ‌ను హీరోయిన్‌గా తీసుకున్నార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు పూజా హెగ్డేనే హీరోయిన్‌గా ఓకే చేశారు. 
 
ఇంత‌కీ ఈ అమ్మ‌డు రెమ్యూన‌రేషన్ ఎంతంటారా...? ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతున్న వార్త‌ల ప్ర‌కారం ఈ సినిమా కోసం పూజా హెగ్డే 1.25 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ అడిగింద‌ట‌. ఇప్ప‌టికే ఆల‌స్యం కావ‌డంతో పాటు ప్ర‌స్తుతం స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తోన్న పూజా హెగ్డే త‌మ సినిమాలో న‌టిస్తే ప్ల‌స్ అవుతుంద‌ని భావించి నిర్మాత‌లు ఆమె అడిగినంత ఇవ్వ‌డానికి రెడీ అయిపోయార‌ట‌. 
 
అలాగే ప్ర‌స్తుతం త‌న‌కున్న డిమాండ్‌ను పూజా హెగ్డే క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. రెమ్యునరేష‌న్ విష‌యంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. యంగ్ హీరోలైన బెల్లంకొండ శ్రీనివాస్, వ‌రుణ్ సినిమాల్లో న‌టించ‌డానికి పూజా హెగ్డే భారీగానే వ‌సూలు చేసింది. ఇక అఖిల్ విష‌యానికి వ‌స్తే.. అఖిల్ మేకింగ్ ప‌రంగా కాంప్ర‌మైజ్ కాకూడ‌ద‌ని అనుకుంటున్నాడ‌ట‌. ఆయ‌న తాను హీరోగా చేసిన అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాల త‌ర్వాత ఈ నాలుగు చిత్రంపై చాలా ఆశ‌ల‌నే పెట్టుకున్నారు. మ‌రి... పూజా ఈ సినిమాకి ఎంతవ‌ర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments