Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో ఈవ్ టీజింగ్ కామన్.. ఎక్కడపడితే అక్కడ చేతులేస్తారు.. నేను అనుభవించా: తాప్సీ

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతుండే విషయం తెలిసిందే. అయితే అదే రాష్ట్రంలో పుట్టిన పెరిగిన తాప్సీకి కూడా ఆ వేధింపులు తప్పలేదట. ఈ అందాల భామ నటించిన తాజా చిత్రం పింక్‌ విడుద

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (17:28 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతుండే విషయం తెలిసిందే. అయితే అదే రాష్ట్రంలో పుట్టిన పెరిగిన తాప్సీకి కూడా ఆ వేధింపులు తప్పలేదట. ఈ అందాల భామ నటించిన తాజా చిత్రం పింక్‌ విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తాప్సీ, కీర్తి కుల్హారి, ఆండ్రియా తరియాంగ్ తదితరులు నటించారు. మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపుల అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
 
ఈ చిత్రం సందర్భంగా తాప్పీ మీడియాతో మాట్లాడుతూ... తాను ఢిల్లీలో పుట్టి పెరిగానని, ఈవ్ టీజింగ్ అనేది ఇక్కడ ఢిల్లీలో సర్వసాధారణమని చెప్పింది. తన జీవితంలో ఇలాంటి బాధలు ఎన్నో అనుభవించానంటూ మీడియాకు వివరించింది. ''ఈవ్‌ టీజింగ్‌ అనేది ఢిల్లీలో రోజూ జరిగే దుశ్చర్య. నాకు 19 ఏళ్లువచ్చాక కారు వచ్చింది. అప్పటివరకు కాలేజీకి బస్సులో వెళ్లేదాన్ని. రోజూ ఆకతాయిలు ఆగడాలు మితిమీరిపోయేవి. అంతేకాదు, ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవారు. ఇదంతా అక్కడ చాలా కామన్‌. నేను ఇలాంటివి ఎన్నో చవిచూశానంటూ''... తన చేదు అనుభవాలను మీడియాతో పంచుకుంది. 
 
ఆకతాయిలకు ఎందుకు బుద్ధి చెప్పలేదని విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ'' నేను పెరిగిన వాతావరణం అలాంటిది. ఎక్కడికీ వెళ్లకూడదు, ఏమీ చేయకూడదు, ఇలాంటి దుస్తులు ధరించకూడదు అనే కట్టుబాట్లు అధికంగా ఉండేవి. దాంతో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తప్పు నాదేనన్నట్లు అక్కడి నుంచి పారిపోయేదాన్ని'' అంటూ తన అనుభవాల్ని పంచుకుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం