Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడి కోసం అన్న త్యాగం.. క్రిస్మస్‌కు 'సింగం-3'

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం "సింగం" సీక్వెల్ ఎస్3. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో సూర్య బిజీ బిజీగా ఉన్నాడు. గతంలో వచ్చిన 'సింగం', 'సింగం-2' చిత్రాలు ఘనవిజయాలు సాధించ‌డంతో 'సింగం-3' సి

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (17:06 IST)
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం "సింగం" సీక్వెల్ ఎస్3. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో సూర్య బిజీ బిజీగా ఉన్నాడు. గతంలో వచ్చిన 'సింగం', 'సింగం-2' చిత్రాలు ఘనవిజయాలు సాధించ‌డంతో 'సింగం-3' సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. సింగం సీరిస్ సినిమాల‌తో టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న హ‌రి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 
 
సౌత్‌లో టాప్ హీరోయిన్లుగా ఉన్న‌ అనుష్క శెట్టి, శృతిహాసన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి సూర్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ స్వ‌రాలందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
 
కానీ ఇప్పుడీ సినిమాను క్రిస్మస్‌ పండుగకు వాయిదా వేసేసుకున్నాడట సూర్య. ఇందుకు కారణం తమ్ముడు కార్తీనేనట. ఎందుకంటే... కార్తీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన కాష్మోరాలో నయనతార - శ్రీవిద్యలు హీరోయిన్స్‌గా నటించగా.. ఈ చిత్రాన్ని దీవాళికి రిలీజ్ చేసేందుకు దర్శకుడు గోకుల్ ప్రయత్నిస్తున్నాడు. 
 
దీంతో సూర్య దీపావళి పండుగ తమ్ముడినే చేస్కోమని చెప్పి తాను తప్పుకున్నాడు. సింగం సీక్వెల్ రిలీజ్ విషయంలో సూర్య నుంచి క్లారిటీ వచ్చేయడంతో అన్నాదమ్ముల మధ్య దీపావళి పోటీ లేనట్లే అని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments