Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరక్టర్ డాలీపై కేకలు వేసిన పవన్ కళ్యాణ్.. కాటమరాయుడు సెట్స్ నుంచి వాకౌట్

దర్శకుడు డాలీ దర్శకత్వంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. ఎప్పుడో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుత

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (09:08 IST)
దర్శకుడు డాలీ దర్శకత్వంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. ఎప్పుడో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. పవన్ ఈ సినిమా షూటింగ్‌తో బిజిబిజీగా ఉన్నాడు. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతోంది. వీలైనంత చకచకా ఈ సినిమా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 
 
అత్యంత విశ్వసనీయ సమాచారం ఏమిటంటే, వచ్చే ఏడాది మార్చి 29న తెలుగు నూతన సంవత్సరాది కానుకగా ''కాటమరాయుడు'' రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలావుంటే ఈ సినిమా సెట్‌‍లో జరిగిన సంఘటన టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఇంతకీ ఆ సంఘటన ఏంటో తెలుసా... దర్శకుడు డాలీ ఓ సీన్‌ని కన్విన్సింగ్‌గా నేరేట్ చేసే విషయంలో తడబడటంతో, పవన్ కళ్యాణ్ గట్టిగా అరిచేశాడని, చాలసేపు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా.. చివరకు గట్టిగానే మాట్లాడాడట పవన్ కళ్యాణ్. తిరిగి సీన్‌లోకి వెళ్లేందుకు మూడ్ సహకరించకపోవడంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడట పవన్ కళ్యాణ్. ఈ సంఘటన నిజమో కాదో తెలియదు కానీ ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments