Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకెవ్వరూ ఛాన్సులివ్వడం లేదు.. నెలకు రూ.2.50 లక్షలు ఇప్పించండి : నటి రంభ

సినీ నటి రంభ మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్తతో కలిసివుండేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటికే ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా తనకు నెలకు రూ.2.50 లక్షలు ఇప్పించాలని కోరింది.

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (08:28 IST)
సినీ నటి రంభ మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్తతో కలిసివుండేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటికే ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా తనకు నెలకు రూ.2.50 లక్షలు ఇప్పించాలని కోరింది. ఈ మేరకు మరో అనుబంధ పిటీషన్‌ను కోర్టులో దాఖలు చేసింది. 
 
టాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి రంభ... కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్రన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో భర్తతో పాటు అత్తమామల వేధింపులు తాళలేక భర్త నుంచి దూరంగా జీవిస్తోంది. 
 
ఈ పరిస్థితుల్లో సమాజంలో ఒంటిరి మహిళగా జీవించడం కష్టంగా ఉందని, తన భర్తతో కలిసి ఉండేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆమె చెన్నై కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది. దానికి అనుబంధంగా నేడు ఆమె మరో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్తతో కలిసి జీవించే పిటిషన్‌ అంశంలో కోర్టు తుది ఉత్తర్వులు జారీచేసే లోపు తనకు నెలకు రెండున్నర లక్షల రూపాయల భృతిని తన భర్త నుంచి ఇప్పించాల్సిందిగా పిటిషన్‌‌లో న్యాయస్థానాన్ని కోరింది.
 
తన భర్తకు కెనడాలో వ్యాపారాలున్నాయని, ఆయన నెలకు 25 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారని పిటిషన్‌లో రంభ పేర్కొంది. సినిమా అవకాశాలు రావడం లేదని, ఇలాంటి సమయంలో తనకు ఇతర ఆదాయ మార్గాలు కూడా లేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కుమార్తెల పోషణ, ఆలనా పాలన, విద్య, ఇతర ఖర్చుల నిమిత్తం నెలకు రెండున్నర లక్షల రూపాయల భృతి ఇచ్చేలా తన భర్త ఇంద్రన్‌‌ను ఆదేశించాలని రంభ పిటిషన్ లో కోరింది. ఈ పిటీషన్లపై కోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments