Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్ త‌ర్వాత ప‌వ‌న్ చేసే సినిమా ఏంటో తెలిస్తే..? (video)

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (20:30 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పింక్ రీమేక్‌తో రీ-ఎంట్రీ ఇవ్వ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌నున్నారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్... ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ స్టార్ట్ కానున్న‌ట్టు స‌మాచారం. 
 
అయితే... ప‌వ‌న్ రీ-ఎంట్రీ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీతో అయితే బాగుంటుంది కానీ.. పింక్ రీమేక్‌తోనా అని ఫ్యాన్స్ కొంతమంది ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. 
 
ఇలా ఆలోచ‌న‌లో ప‌డ్డ వారికి కిక్ ఇచ్చే వార్త ఏంటంటే... పింక్ త‌ర్వాత ప‌వ‌న్ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ మ‌ల్టీస్టార‌ర్ ఎవ‌రితోనో కాదు.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో అని టాక్ వినిపిస్తోంది. 
 
ఇప్ప‌టికే కొంతమంది ద‌ర్శ‌కులు స్క్రిప్ట్ వ‌ర్క్ స్టార్ట్ చేసార‌ట‌. ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో మ‌రింత స్పీడుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ట‌. ఈ మూవీని ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటీవ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పైన ప‌వ‌న్ క‌ళ్యాణే సొంతంగా నిర్మిస్తార‌ని తెలిసింది.

ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్, చ‌ర‌ణ్ క‌లిసి సినిమా చేస్తే చూడాల‌నుకుంటున్నారు అభిమానులు. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే.. మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే..!
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: కేటీఆర్‌కు వేరు ఆప్షన్ లేదా? బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారా?

బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...

నాగార్జున సాగర్‌లో మా ప్రేమ చిగురించింది : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజలను మోసం చేసేవాళ్లు గొప్ప నాయకులు : నితిన్ గడ్కరీ

KCR: సీబీఐకి కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీష్ రావులు అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments