Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరీష్, సూరి సినిమాలకు అందుకే పవన్ ఓకే చెప్పాడా..?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (15:17 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్లో చారిత్రాత్మక సినిమా చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ రెండు సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నట్టు ప్రకటించారు.
 
అయితే... హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలు చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే... ఈ రెండు సినిమాలు పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందే సినిమాలే. హరీష్ శంకర్ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందే సినిమా అని కాన్సెప్ట్ పోస్టర్‌ను బట్టి తెలుస్తుంది. ఇక సురేందర్ రెడ్డితో చేయనున్న మూవీ కూడా పొలిటికల్ డ్రామానే అని టాలీవుడ్ టాక్.
 
ఈ రెండు సినిమాల కథలు తన పొలిటికల్ కెరీర్‌కి ఉపయోగపడేలా ఉండడంతో వెంటనే ఓకే చెప్పాడని తెలిసింది. ఇప్పుడు పవన్ ముందు ఉన్న టార్గెట్ 2024. అందుచేత అప్పటిలోగా వీలైనన్ని సినిమాలు చేసి ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారట. మరి.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments