Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ కేసుపై విజయశాంతి కామెంట్స్.. ఎందరో మహిళా నటులు..?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (14:17 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై ప్రముఖ నటి, కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకేలా ఉండాలన్న ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వ్యాఖ్యలను ఈ సందర్భంగా విజయశాంతి ఉదహరించారు. దర్యాప్తు సంస్థల వల్ల ఆశించిన స్థాయిలో ఫలితం రాని సమయాల్లో ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్లకపోవడం వల్ల ఎన్నో కేసులు నీరు గారిపోతున్నాయని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అయితే సుశాంత్ కేసులో దోషుల్ని పట్టుకునేందుకు, వాస్తవాల్ని వెలికి తీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయని ప్రశంసించారు. ఒకప్పుడు మన సినీ రంగంలోనూ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండేవని, ఎందరో మహిళా నటులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కేసుల్లో ఈ స్థాయిలో దర్యాప్తులు జరిగి ఉంటే వారి ఆత్మకు శాంతి కలిగి ఉండేదని అన్నారు. 
 
నామమాత్రపు కేసులు, తూతూమంత్రపు విచారణలతో చివరికి మమ అనిపించేశారని విజయశాంతి మండిపడ్డారు. సుశాంత్ కేసులు ప్రతి రోజు వెలుగుచూస్తున్న విషయాలు విస్మయానికి గురిచేస్తున్నాయన్నారు. దర్యాప్తులు, విచారణలు వివక్షకు తావులేకుండా ఉండాలన్నారు. కాగా.. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ నెల 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకి పాల్పడిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

మహిళల భద్రత కోసం Shakti App: ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీ సేవలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments