Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌ను ఇరకాటంలో పెడుతున్న ఫ్యాన్స్, ఏమైందంటే?

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (18:43 IST)
తమ ఫేవరేట్ హీరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రాకపోతే అభిమానులందరూ ఏం చేస్తారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా మేకర్స్‌ను డిమాండ్ చేస్తారు. మరికొంతమంది ట్రోల్స్ చేస్తారు. కానీ చేతిలో ఫోటో షాప్ ఉన్న ఫ్యాన్స్ మాత్రం తామే ఓ పోస్టర్‌ను డిజైన్ చేసి ఇదే ఫస్ట్ లుక్ అంటూ డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
 
తమ హీరోలను సోషల్ మీడియాలో ట్రెండింగ్ తీసుకొస్తుంటారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అభిమానులు నెక్ట్స్ సినిమా విషయంలోను ఇదే చేశారట. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ డైరెక్టన్లో తెరకెక్కించబోయే పిఎస్ పికె 27 సినిమా కోసం లాక్ డౌన్ సమయంలో ఓపిగ్గా కూర్చుని చూసిన అభిమానులు ఇక లాభం లేదనుకుని తామే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే సరిపోతుందని అనుకున్నారట.
 
దీంతో ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట. రాత్రికి రాత్రి వైరల్ అయిన ఈ పోస్టర్‌ను చూసిన సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మైవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఇది అఫిషియల్ పోస్టర్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చారట. పవన్ కళ్యాణ్ 28వ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ఈ యేడాది ఉగాది రోజున విడుదల చేయాలని భావించా.
 
అయితే కరోనా కారణంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేశాం. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. సినిమాకు సంబంధించి ఏ విషయమైనా అఫిషియల్ అకౌంట్ల ద్వారా సరైన సమయంలో వెల్లడిస్తామంటూ ఈ సినిమా గురించి మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments