భీమ్లా నాయక్ క‌థ‌ను పూర్తిగా మార్చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌!

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (08:20 IST)
pawan-rana
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా సినిమా భీమ్లా నాయక్. దీని మాతృక మ‌ల‌యాళంలోని అయ్య‌ప్ప‌న్ కోషియ‌మ్‌. దాన్ని య‌దాత‌థంగా తీస్తే తెలుగు ప్రేక్ష‌కుల‌కు రుచింద‌ని ఈ చిత్ర‌ను పూర్తిగా మార్చేసిన‌ట్లు చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఇద్ద‌రు ఇగోయిస్టుల మ‌ధ్య జ‌రిగేవారే ఈ సినిమా. ఒక‌రు పోలీసు ఆఫీస‌ర్ అయితే మ‌రొక‌రు చిత్ర హీరో. అత‌నే రానా. ఈ కేరెక్టర్లు అలాగే వుంచారు. వారి మ‌ధ్య వ‌చ్చే స‌మ‌స్య‌ను పూర్తిగా తెలుగు నేటివిటీకి మార్చేశారు. న‌గ్జ‌లైట్ వ్య‌వ‌స్థ‌కు, సామాన్యుల‌కు, పోలీసు వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య జ‌రిగే సున్నిత‌మైన అంశాన్ని ఇందులో పొందుప‌ర్చిన‌ట్లు తెలిసింది.
 
ముఖ్యంగా మ‌హిళా స‌మ‌స్య‌ల‌ను ఇందులో చూపించ‌నున్నారు. న‌గ్జ‌లైట్లో మ‌హిళ‌లు ఏ విధంగా త్యాగాలు చేసి పోరాడుతుంటారు. ఎందుకు పోరాడుతుంటారు? ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చాక వారి ప‌రిస్థితి ఏమిటి? అనేది మ‌ల‌యాళ సినిమాలో అంత‌గా చూపించ‌లేదు. కానీ భీమ్లా నాయక్ లో పూర్తిగా చూపించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓ మ‌హిళ‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం భీమ్లా నాయక్ ఏమి చేశాడ‌నేది హార్ట్ ట‌చింగ్ గా వుంటుంద‌ని తెలుస్తోంది. మ‌హిళ ఏ రంగంలోవున్నాహ‌క్కులు కాల‌రాయ‌కూడ‌ద‌నే డైలాగ్‌లు బాగా ఆలోచింప‌జేసేవిగా వుంటాయ‌ని తెలుస్తోంది.
 
తాజా స‌మాచారం మేర‌కు  ప‌వ‌న్ డ‌బ్బింగ్ కొద్దిగా పెండింగ్ వుండ‌డంతో నిన్న రాత్రి లేట్ అయినా పూర్తిచేసి వెళ్లాడ‌ని తెలిసింది. ఈ నెల 25న సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర పనులు వివిధ లొకేషన్లలో జరుగుతున్నాయి. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు.  థమన్ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments