Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి "ఖైదీ"ని చూసిన పవన్ కళ్యాణ్... 'చిరంజీవినా మజకా' అంటూ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు దశాబ్దకాలం తర్వాత వెండితెరపై చిరంజీవి రీఎంట్రీ ఇచ్చారు. దీం

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (09:53 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150" ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు దశాబ్దకాలం తర్వాత వెండితెరపై చిరంజీవి రీఎంట్రీ ఇచ్చారు. దీంతో చిరంజీవి ఎలా నటించారోనన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ నెలకొనడంతో సాధారణ ప్రేక్షకుడి నుంచి సినీ ప్రముఖుల వరకు ఈ చిత్రాన్ని చూసేందుకు పోటీపడ్డారు. ఆ తర్వాత తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. 
 
కానీ, చిరంజీవి సోదరుడు, హీరో పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ఈ చిత్రంపై కామెంట్స్ చేయలేదు. అంటే.. రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న అన్నయ్య చిత్రాన్ని తమ్ముడు పవన్ కళ్యాణ్ చూశాడా..? అనేది అందరిలో మొదలైన ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇపుడు ఫుల్‌స్టాప్ పెట్టారు. 
 
ఈ వార్తలను మెగా కాంపౌడ్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ బాబాయ్ కోసం ఈ చిత్ర నిర్మాత, హీరో, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ స్పెషల్ షోను వేయించినట్టు సమాచారం. ఈ సినిమా చూసిన తర్వాత చిరంజీవికి పవన్ ప్రత్యేక అభినందనలు తెలిపాడట. సినిమా ఎంతో బాగుందని, చిత్ర నటి, నటులకు, దర్శకుడు వినాయక్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీకి విషెస్ చెప్పాడట. ఈ వార్తలో నిజానిజాలు ఎలా ఉన్నా.. ఈ సమాచారం మొత్తం మెగా ఫ్యాన్స్‌లో ఫుల్‌జోష్‌ను మాత్రం నింపిందని చెప్పొచ్చు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments