Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి "ఖైదీ నంబర్ 150"ను డోనాల్డ్ ట్రంప్ చూశారా? సోషల్ మీడియాలో వైరల్

మెగాస్టార్ చిరంజీవి దశాబ్దకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 11వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమేకాకుండా కనకవర్షం కురిపి

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (09:21 IST)
మెగాస్టార్ చిరంజీవి దశాబ్దకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 11వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమేకాకుండా కనకవర్షం కురిపిస్తూ... టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీకి గ్రాండ్ వెల్‌కమ్‌గా మారింది. 
 
ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా విడుదలైంది. అక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంటే ఓవర్సీస్‌లో కూడా "బాస్ ఈజ్ బ్యాక్" మానియా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా 'ఖైదీ' చిత్ర ప్రదర్శనను తిలకించారట. దీనికి సంబంధించి ట్విట్టర్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా, చిరంజీవికి ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ప్రశంసించినట్లు కొన్ని వెబ్‌సైట్లు వార్తలు కూడా రాసేశాయి.
 
ఈ వార్తలో నిజానిజాలెంతో పరిశీలించగా, ఇదో ఫేక్ వార్త అని తేలిపోయింది. చిరంజీవి మూవీ 11వ తేదీన విడుదలైతే జనవరి 10వ తేదీనే ట్రంప్ చిత్రాన్ని చూసి ట్విట్టర్‌లో కామెంట్స్ చేసినట్టు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీన్ని కొందరు గుడ్డిగా ప్రచారంలో పెట్టేశారు. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గడానికి రష్యా సాయం తీసుకున్నారనే విమర్శలపై వివరణ ఇచ్చుకోలేక సతమతమవుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

సంక్రాంతి రద్దీ : 52 అదనపు ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన ద.మ.రైల్వే

19 ఏళ్ల యువకుడితో 32 ఏళ్ల భార్య అర్థరాత్రి రాసలీల చూసి హత్య చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments