Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవిని చూస్తే అర్జెంటుగా పని వుందని పారిపోతున్నారట... ఎవరు?

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (20:02 IST)
ఫిదా సినిమాతో అమాంతం అగ్ర హీరోయిన్ల సరసన చేరిపోయారు సాయిపల్లవి. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా ఆడలేవు. కానీ సాయిపల్లవి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సాయిపల్లవి సినిమా అంటే యువ ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరి కనిపిస్తుంటారు.
 
తాజాగా సాయిపల్లవి నటించిన పడి పడి లేచే మనస్సు సినిమా ఈ నెల 21వ తేదీన విడుదలైంది. ప్రారంభంలో భారీ కలెక్షన్లు వచ్చినా ఆ తరువాత సినిమా టాక్ విభిన్నంగా వినిపించింది. కొత్తదనం చూపించే క్రమంలో కంటెంట్ మిస్సయి కథ మొత్తం మారిపోయిందంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా మొత్తానికి సాయిపల్లవే స్పెషల్ ఎఫెక్ట్.
 
హీరో శర్వానంద్ కన్నా సాయిపల్లవిని చూసేందుకు ఎక్కువగా అభిమానులు థియేటర్లకు చేరుకుంటున్నారు. అయితే ఆ సినిమా కాస్తా నెగటివ్ టాక్ రావడంతో సాయిపల్లవితో సినిమా చేసేందుకు దర్సకులు ముందుకు రావడం లేదట. పడి పడి లేచే మనస్సు సినిమా సెట్స్ పైన ఉండగా సాయి పల్లవికి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయట. అయితే ఒక సినిమా చేసేటప్పుడు మరో సినిమా సాయి పల్లవికి చేయడం ఇష్టం ఉండదు.
 
అందుకే ఆమె ఆ సినిమాను ఒప్పుకోలేదట. కానీ చేసిన సినిమా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో సాయి పల్లవికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. చేతికొచ్చిన రెండు సినిమాలు ఆమె చేజారిపోయాయి. దర్సకులు సాయిపల్లవిని కాదని వేరే హీరోయిన్లను వెతుక్కుంటున్నారట. దీంతో సాయి పల్లవి కనిపిస్తే... అర్జెంట్ పని ఉంది మళ్ళీ కలుద్దామంటూ అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటున్నారట. అయితే ఇదంతా సినీపరిశ్రమలో మామూలేనని లైట్ తీసుకుంటోందట సాయి పల్లవి. మరి సాయిపల్లవికి మళ్ళీ అదృష్టం ఎప్పుడు కలిసొస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments