Webdunia - Bharat's app for daily news and videos

Install App

విన‌య విధేయ రామ గురించి నిర్మాత దాన‌య్య..?

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (18:23 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న భారీ బ‌డ్జెట్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `విన‌య విధేయ రామ‌`. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను 2019 సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్బంగా స్టార్‌ నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ - `మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను క్రేజీ కాంబినేష‌న్‌లో `విన‌య‌విధేయ‌రామ‌` సినిమాను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి అంచ‌నాలు పెరుగుతూ వ‌స్తున్నాయి. మెగాభిమానులు, ప్రేక్ష‌కులు సినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, రెండు సాంగ్స్ సోష‌ల్ మీడియాలో క్రియేట్ చేసిన సెన్సేష‌నే అందుకు సాక్ష్యం. ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం భారీ సెట్‌లో చివ‌రి పాట‌ను చిత్రీక‌రిస్తున్నాం. 
 
ఈ నెల 27న హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడ‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో సినీ ప్ర‌ముఖులు, మెగాభిమానులు, ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ లెవ‌ల్లో నిర్వ‌హించ‌బోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుక‌గా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments