Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జనతా గ్యారేజ్‌' భారీ బిజినెస్.. ఎన్టీఆర్ రెమ్యునరేషన్‌గా రూ.18 కోట్లు.. నిజమేనా?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "జనతా గ్యారేజ్". ఈ చిత్రంలో ఎన్టీ ఆర్ సరసన నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'స్టూడెంట్ నెం.1' చిత్రంతో ఎంట్రీ ఇచ్

Webdunia
శనివారం, 25 జూన్ 2016 (14:40 IST)
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "జనతా గ్యారేజ్". ఈ చిత్రంలో ఎన్టీ ఆర్ సరసన నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'స్టూడెంట్ నెం.1' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. లవర్ బాయ్‌గానేకాకుండా మాస్ ఫాలోయింగ్ ఉన్న సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు. 
 
''నాన్నకు ప్రేమతో'' చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం కావడంతో ''జనతా గ్యారేజ్'' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నాడు. మాఫియా నేపథ్యంతో పాటు మంచి కుటుంబ తరహా చిత్రంగా ఈ చిత్రం రూపొందుతోంది. 
 
ఈ చిత్రం భారీ ఎత్తున బిజినెస్ కావడంతో ఎన్టీఆర్‌కు రెమ్యునరేషన్ భారీగానే ముట్టినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు రెమ్యూనరేషన్‌గా రూ.18 కోట్లు తీసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యిందంటే.. ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్స్ సాధించినట్లే. 'జనతా గ్యారేజ్' టీమ్ మాత్రం ఎలాగైనా ఆగస్టు 12న కృష్ణ పుష్కరాల కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి పక్కా ప్రణాళిక వేసుకుంటున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments