Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒక మనసు'లో నీహారిక డ్రస్సులు అదుర్స్.. నాగబాబు వైఫ్ డిజైన్‌ చేసినవేనట...

మెగా అభిమానుల మోస్ట్ అవైటెడ్ మూవీ ''ఒక మనసు'' జూన్ 24 రిలీజైన సంగతి తెలిసిందే. మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా ఫ్యామిలీ ను

Webdunia
శనివారం, 25 జూన్ 2016 (13:40 IST)
మెగా అభిమానుల మోస్ట్ అవైటెడ్ మూవీ ''ఒక మనసు'' జూన్ 24 రిలీజైన సంగతి తెలిసిందే. మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు ఎంట్రీ ఇచ్చినా, తొలి హీరోయిన్ నాగబాబు డాటర్ నిహారిక కావడంతో అభిమానులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. 
 
''ఒక మనసు'' సినిమాను చూసిన అమ్మాయిలు మాత్రం ఒక విషయంలో నిహారికని అమితంగా మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో నిహారిక తెలుగుదనం ఉట్టిపడేలా కాటన్ చీరలు, చుడీదార్లతో అందంగా కనిపించింది. ఈ మూవీలో ప్రధానమైన హైలైట్.. నిహారిక లుక్ అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రతీ ఫ్రేమ్‌లోనూ ఎంతో అందంగా కనిపించింది నిహారిక. 
 
వాస్తవానికి 30-40 సన్నివేశాలకుగాను 60-70 డ్రస్సులతో నిహారిక ఈ సినిమాలో దర్శనమిచ్చింది. ఎక్కడా ఆర్భాటం లేకుండా సాదాసీదాగా శారీస్, చుడీదార్లు, పంజాబీ డ్రస్సులు దానికి తగ్గట్లుగా మ్యాచింగ్ ఆర్నమెంట్స్‌తో అందంగా కనిపించింది నిహారిక. నిజానికి ఈ క్రెడిట్ అంతా నాగబాబు వైఫ్ పద్మజకే దక్కుతుంది. ఇవన్నీ పద్మజ సొంత డిజైన్సేనట. కూతురును సినిమా రంగానికి పరిచయం చేస్తూ ఆమె తీసుకున్న జాగ్రత్తలు అమోఘం అంటూ పలువురు కితాబు నిస్తూ, ఈ విషయంలో మాత్రం నాగబాబు వైఫ్‌కి హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments