Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్న యంగ్ టైగర్ ఎన్‌టీఆర్..? (video)

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (18:48 IST)
యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం అతడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కొమరం భీం పాత్రలో ఎన్‌టీఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఎన్‌టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అయినను పోయిరావలె హస్తినకు అనే సినిమాను చేయనున్నారు. 
 
ఈ సినిమా తరువాత ఎన్‌టీఆర్ చేయనున్న సినిమాపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో దర్శకులుగా ప్రశాంత్ నీల్, అట్లీ, లోకేష్ కనగరాజ్ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ తన తదుపరి చిత్రం తరువాత హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారట. ఈ క్రమంలో ఇండో అమెరికన్ దర్శకుడితో సంప్రదింపులు కూడా జరిగాయని వార్తలు వస్తున్నాయి.
 
హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తన సినిమాలో ఎన్‌టీఆర్‌ను అనుకున్నారని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతడు ఇప్పటికే హాలీవుడ్‌లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. వాటిలో అన్‌బ్రేకబుల్, స్ప్టిట్, ది సిక్స్త్ సెన్స్, గ్లాస్ సినిమాలు ఉన్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలీదు కానీ ఇది నిజం కావాలని ఎన్‌టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇది నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments