Webdunia - Bharat's app for daily news and videos

Install App

'420'గా రానున్న జూనియర్ ఎన్టీఆర్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో...

'జనతా గ్యారేజ్' సినిమా ఘనవిజయాన్ని సాధించడంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నాడు. తన తదుపరి చిత్రాన్ని వక్కంతం వంశీతో చేయాల్సి వున్నా... కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వాయిదా పడింది

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (13:34 IST)
'జనతా గ్యారేజ్' సినిమా ఘనవిజయాన్ని సాధించడంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నాడు. తన తదుపరి చిత్రాన్ని వక్కంతం వంశీతో చేయాల్సి వున్నా... కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. దాంతో పూరి జగన్నాథ్‌తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 
 
వాస్తవానికి ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి ఇంకా ఏ టైటిల్ అనుకోలేదనీ... పూర్తి కథ రెడీ అయిన తర్వాతనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని యూనిట్ సభ్యులు అంటున్నారు. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి '420' అనే టైటిల్‌ను పూరి పరిశీలిస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ''ఆంధ్రావాలా'' పరాజయం పాలైనా, రెండో సినిమా ''టెంపర్'' మాత్రం ఈ కాంబినేషన్‌కు ఓ ప్రత్యేక క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. 
 
దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టులో సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments