Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్చ్.. చెల్లిగా నటించాలా? డైలామాలో పడిన నివేదా థామస్?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (23:31 IST)
టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 22వ చిత్రం "ఆదిపురుష్". బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఐదు భాషల్లో పాన్ ఇండియా నిర్మించనున్న ఈ చిత్రంలో నటించే నటీనటుల పేర్లు వెల్లడికావాల్సివుంది. 
 
అయితే, ఈ చిత్రానికంటే ముందు వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొనెను ఎంపిక చేశారు. అయితే, ఈ చిత్రంలో సెకండ్ కథాయికకు కూడా స్కోప్ ఉందనీ, ఆ పాత్రకు నివేదా థామస్‌ను ఎంపిక చేశారనే వార్తలు హల్చల్ చేశాయి. 
 
అయితే, ఇపుడు ఈ వార్తలు మరోలా వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో నివేథాని అడిగింది సెకండ్ హీరోయిన్‌గా నటించడానికి కాదంట. ప్రభాస్ సోదరిగా నటించడానికి అడిగారట. అయితే నివేథా ముందు ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించినా, సోదరిగా అనేసరికి మళ్లీ ఆలోచనలో పడిందని అంటున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. అలాగే నివేథా థామస్ కూడా ఇప్పటివరకు ఈ విషయంపై మాట్లాడలేదు. ఏ విషయం చిత్రయూనిట్ తెలపాల్సి ఉంది.
 
కాగా, ప్రభాస్ "బాహుబలి" సీక్వెల్ చిత్రాల తర్వాత నటించిన 'సాహో' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో తన తదుపరి చిత్రంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న 'రాధేశ్యామ్' చిత్రం పూర్తవగానే.. నాగ్ అశ్విన్‌తో తన 21వ చిత్రాన్ని (వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించే చిత్రం), ఓం రౌత్‌తో తన 22వ చిత్రం 'ఆదిపురుష్'ని ప్రభాస్ సెట్‌పైకి తీసుకెళ్లనున్నారు. 

సంబంధిత వార్తలు

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments