Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళంలో పాగా కోసం పాట్లు : నిధి అగర్వాల్ ఆశలన్నీ గల్లంతు!

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (18:05 IST)
తమిళంలో పాగా వేయాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. అలాగే, నిధి అగర్వాల్ కూడా ఆశపడింది. ఇందుకోసం తమిళ హీరోతో జతకట్టింది. జయం రవి హీరోగా నటించిన 25వ చిత్రం "భూమి". ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ఎంతో ఎదురు చూశారు. కానీ, అక్టోబరు నెలలో కూడా తమిళనాట థియేటర్లు తెరుచుకోవడం లేదు. దీంతో ఓటీటీలో 'భూమి' చిత్రం విడుదల కానుంది. 
 
నిజానికి 'భూమి' సినిమా థియేటర్‌ విడుదల కోసం దర్శక నిర్మాతలు, హీరో జయం రవితో పాటు హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ చాలా ఆశగా ఇన్ని రోజులూ ఎదురుచూశారు. ముఖ్యంగా 'ఇస్మార్ట్‌' బ్యూటీ నిధి అగర్వాల్‌ 'భూమి' సినిమాపై చాలా ఆశలను పెట్టుకుంది. ఎందుకంటే ఈమె నటించిన తొలి తమిళ చిత్రమిది. 
 
చేతిలో అంతంత మాత్రమే అవకాశాలున్న తరుణంలో 'భూమి' సినిమాతో కోలీవుడ్‌లో పాగా వేయొచ్చని నిధి భావించింది. అయితే సినిమా ఓటీటీలోనే విడుదలవుతుంది. ఈ విషయంలో ఆమె చేసేదేమీ లేదు. 'భూమి' విషయంలో అనుకున్నదొకటైతే అయ్యిందొకటంటూ.. నిధి అగర్వాల్‌ అసంతృప్తిగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
కాగా, ఈ అమ్మడు తెలుగులో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చింది. అందులో ఒకటి అక్కినేని అఖిల్ నటించిన 'మజ్ను' చిత్రం కాగా, రామ్ పొత్తినేని నటించి 'ఇస్మార్ట్' ఒకటి. ఇందులో ఇస్మార్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments