Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్పలో విలన్‌గా నేనా?

Advertiesment
పుష్పలో విలన్‌గా నేనా?
, బుధవారం, 30 సెప్టెంబరు 2020 (10:38 IST)
సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప సినిమా షూటింగ్ కరోనా కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మంథాన ప్రధాన పాత్రధారులుగా కనిపిస్తున్నారు. 
 
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.
 
గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. తాజాగా సినిమాలో విలన్‌గా మాధవన్ నటిస్తారని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై మాధవన్ స్వయంగా స్పందించారు. 
 
పుష్పలో విలన్‌గా నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, ఈ సినిమాలో అల్లు అర్జున్ మేకోవర్ సైతం కొత్తగా ఉంది. అలానే ఆయన స్లాంగ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పారు. కాగా మాధవన్ తాజాగా అనుష్క శెట్టితో కలిసి నిశ్శబ్ధం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ఓటీటీలో విడుదల కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెక్స్ రాకెట్ నడిపిన కన్నడ హీరోయిన్లు? రాగిణి - సంజన్ ఫోన్లలో నీలి చిత్రాలు!