Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓటీటీలో అక్టోబర్ 2న 'నిశ్శబ్ధం' విడుదల..

Advertiesment
ఓటీటీలో అక్టోబర్ 2న 'నిశ్శబ్ధం' విడుదల..
, శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (17:10 IST)
స్టార్ హీరోయిన్ అనుష్క లేటెస్ట్ చిత్రం 'నిశ్శబ్దం'. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్‌తో పాటు థియేటర్స్ కూడా మూతపడ్డాయి. 
 
ఈ లాక్‌డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. 
 
ఇప్పటికే నాని, సుధీర్ బాబు నటించిన వి ఈనెల 5న అమెజాన్‌ ప్రైమ్‌‌లో విడుదలై మంచి టాక్'ను తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే బాటలో తెలుగులో చాలా సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. అందులో భాగంగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమాకు కూడా డీల్ కుదిరి ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది.
 
అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడడంతో విడుదల ఆగిపోయింది. ఇన్నాళ్లు ఆగిన నిర్మాత ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ అమ్మారు. ఈ సినిమాను అమేజాన్ ప్రైమ్ దాదాపు 25 కోట్ల పెట్టి స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని సమాచారం అందుతోంది. 
 
అమేజాన్ ప్రైమ్ వీడియోలో మొత్తం మూడు భాషల్లో ఏకకాలంలో అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. తెలుగు తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో అనుష్క సరసన మాధవన్ మేల్ లీడ్‌లో నటించగా అంజలి, షాలిని పాండేలు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంగవ్వకు కెప్టెన్సీనా.. ఐపీఎల్‌తో పోటీపడనున్న బిగ్ బాస్ 4..?