Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార అంత సులువుగా ఒప్పుకుంటుందని ఊహించలేదు.. యోగిబాబు

కమెడియన్ సునీల్‌కు హీరోగా మంచి గుర్తింపు నిచ్చిన సినిమా అందాల రాముడు. ఈ సినిమా పేరు చెప్పగానే అందాల తార ఆర్తీ అగర్వాల్ గుర్తొస్తుంది. సునీల్‌తో నటించే ముందు వరకు ఆర్తీ అగర్వాల్ అగ్రహీరోలతోనే నటించారు. అసలు అందాల రాముడు సినిమాలో సునీల్‌తో నటిస్తుందో ల

Webdunia
సోమవారం, 9 జులై 2018 (22:40 IST)
కమెడియన్ సునీల్‌కు హీరోగా మంచి గుర్తింపు నిచ్చిన సినిమా అందాల రాముడు. ఈ సినిమా పేరు చెప్పగానే అందాల తార ఆర్తీ అగర్వాల్ గుర్తొస్తుంది. సునీల్‌తో నటించే ముందు వరకు ఆర్తీ అగర్వాల్ అగ్రహీరోలతోనే నటించారు. అసలు అందాల రాముడు సినిమాలో సునీల్‌తో నటిస్తుందో లేదో అన్న అనుమానం అందరిలోను ఉండేది. కానీ ఒక కమెడియన్‌కు లైఫ్ ఇచ్చేందుకు అతనితో కలిసి నటించింది ఆర్తీ అగర్వాల్. ఆ సినిమా అప్పట్లో ఎంత విజయాన్ని సాధించిందో తెలిసిందే. 
 
ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో కూడా అలాంటి కాంబినేషనే మరోసారి కనిపించనుంది. ఈసారి నయనతార, యోగిబాబు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కోలమావు కోకిల సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో కమెడియన్ యోగిబాబు హీరో. చింపిరి జుట్టు వేసుకుని.. నల్లగా.. బాన పొట్టతో కనిపించే యోగిబాబుతో కలిసి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నదట నయనతార. 
 
ముందుగా డైరెక్టర్ నయనతారను కలిసి కథను చెప్పారట. హీరో ఒక కమెడియన్ అని చెప్పగానే నయనతార ఏమీ ఆలోచించకుండా సరేనంటూ ఒప్పుకున్నారట. తన సినిమాలో నయనతార నటించడానికి ఒప్పుకోవడమే కాకుండా తాను హీరోగా పైకొచ్చేందుకు సహకరించడంతో ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతున్నారట యోగిబాబు. అంతేకాదు రెండురోజుల్లో నయనతార, యోగిబాబుల మధ్య ఒక టీజర్‌ను కూడా సిద్ధం చేసి విడుదల చేశారట. ఆ టీజర్ కాస్త ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments