Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవంతుడితో భక్తుడి సెల్ఫీ అదుర్స్.. 'ఓం నమో వెంకటేశాయ'లో నాగ్ లుక్స్ అదుర్స్

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎంతో భక్తి శ్రద్ధలతో తెరకెక్కిస్తున్న చిత్రం ''ఓం నమో వెంకటేశాయ''. అక్కినేని నాగార్జున కథనాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హథీరాంబాబా జీవిత నేపధ్యంతో ఈ చిత్రం రూపొందుతో

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (10:31 IST)
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎంతో భక్తి శ్రద్ధలతో తెరకెక్కిస్తున్న చిత్రం ''ఓం నమో వెంకటేశాయ''. అక్కినేని నాగార్జున కథనాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హథీరాంబాబా జీవిత నేపధ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. జూలై 2న అన్న పూర్ణ స్టూడియోలో వేసిన ఆలయం సెట్టింగ్‌లో షూటింగ్ మొదలు కాగా, ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో కథానాయికలుగా అనుష్క, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అన్నమయ్య, శ్రీ రామదాసు, షిరిడి సాయి తర్వాత నాగ్- రాఘవేంద్రరావు కాంబినేషనల్‌లో వస్తోన్న మరో భక్తి రస చిత్రం ఓం నమో వెంకటేశాయ. 
 
సంక్రాంతి రిలీజ్ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సౌరభ్ జైన్ వెంకటేశ్వర స్వామిగా కనిపించనున్నాడు. ఆ మధ్య జైన్ లుక్ రివీల్ చేసిన యూనిట్ ఆ తర్వాత అనుష్క, నాగ్ లుక్స్‌‌ని కూడా విడుదల చేసింది. మొన్నటివరకు మహాబలేశ్వరంలో షూటింగ్ జరుపుకున్న చిత్ర యూనిట్ తాజాగా ప్యాకప్ చెప్పి హైదరాబాద్‌కి మకాం మార్చింది. త్వరలో తదుపరి షెడ్యూల్‌ని మొదలు పెట్టనున్నారు. 
 
అయితే షూటింగ్‌కి ప్యాకప్ చెప్పిన తర్వాత సౌరభ్ జైన్, నాగార్జున కలిసి సరదాగా ఓ సెల్ఫీ దిగారు. ఆ ఫోటోను సౌరభ్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. పోస్ట్ చేసిన సెల్ఫీకి వెరైటీ కామెంట్స్ వస్తున్నాయి. భగవంతుడితో భక్తుడి సెల్ఫీ అదుర్స్ అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments