Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ మతాన్ని స్వీకరించిన సమంత.. నాగార్జున ఇంట్లో మతమార్పిడి పూజలు?

సమంత-నాగ చైతన్య వివాహానికి నాగార్జున.. అమల దంపతులు ఓకె చెప్పేసినట్లే అంటూ వార్తలు వెలువడ్డాయి. చైతూ మంచి అమ్మాయిని చూసుకోవడం అమలకు ఆనందాన్నిచ్చింది అంటూ నాగ్ అన్నట్టు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్న

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (14:39 IST)
సమంత-నాగ చైతన్య వివాహానికి నాగార్జున.. అమల దంపతులు ఓకె చెప్పేసినట్లే అంటూ వార్తలు వెలువడ్డాయి. చైతూ మంచి అమ్మాయిని చూసుకోవడం అమలకు ఆనందాన్నిచ్చింది అంటూ నాగ్ అన్నట్టు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్న సంగతి తెలిసిందే. గడచిన కొన్నాళ్లుగా నేరుగా సమంత-చైతూల పేరుతోనే మొత్తం అన్ని రకాల ప్రసార మాధ్యమాల్లో వార్తల పరంపర సాగుతోంది. 
 
సమంత అక్కినేని కుటుంబంతో కలిసిపోయి వారితో కుటుంబ సభ్యురాలిలాగే పార్టీలకు, ఫంక్షన్‌లకు హాజరవుతూ వస్తోంది. నాగార్జున కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో వచ్చే ఏడాది వీరిద్దరి పెళ్ళి జరగనుంది. ఇక ఇదిలావుంటే చైతన్య, సమంతల పెళ్ళి ఏ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుందనే విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
క్రిస్టియన్ అయిన సమంత, హిందువు అయిన నాగ చైతన్య ఈ ఇద్దరి పెళ్ళి రెండు సాంప్రాదాయాల ప్రకారం జరగనుందని వినిపించగా, తాజాగా నాగార్జున, నాగ చైతన్య, సమంతలు కలిసి చేసిన ఓ పూజ ఆసక్తికరంగా మారింది. నాగార్జున సమక్షంలో చైతన్య, సమంత ఇద్దరూ పూజలో కూర్చున్నట్లు కనిపించిన ఫోటోలు బయటికి వచ్చాయి.

పక్కనే నాగార్జున.. పురోహితులు కూడా నిలబడి ఉన్నారు. దీంతో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. మరో వాదన ఏమిటంటే.. క్రిస్టియన్ మతస్తురాలైన సమంత హిందూ మతం పుచ్చుకుందని, హిందూ సాంప్రదాయాలు ప్రకారం వివాహం జరగాలంటే ముందు మత మార్పిడి జరగాలని, ఇప్పుడీ తంతునే జరిపారనే ప్రచారం కూడా వుంది. అసలు విషయం ఏమిటనేది ఇంకా తెలియాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments