Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండమ్మ కథ రీమేక్ : హీరోలుగా ఎన్టీఆర్ - నాగచైతన్య.. టాప్ ప్రొడ్యూసర్ ప్లాన్

ఎన్టీఆర్, నాగ చైతన్య కలిసి మరో మల్టీ స్టారర్ చిత్రం నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతుంది. మహానటి సావిత్రి గాథ‌ని వెండి తెరపైకి తీసుకొచ్చే ప్రయ

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (12:13 IST)
ఎన్టీఆర్, నాగ చైతన్య కలిసి మరో మల్టీ స్టారర్ చిత్రం నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతుంది. మహానటి సావిత్రి గాథ‌ని వెండి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్న విషయంతెలిసిందే. ''సావిత్రి'' పాత్రలో నిత్య మీనన్ కనిపించనున్న ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. స్క్రిప్ట్ పనులు పూర్తి కావచ్చాయి. ప్రస్తుతం మిగిలిన పాత్రలకు వెతుకులాట సాగుతోంది. 
 
సావిత్రి కథ అంటే ఎన్టీఆర్, అక్కినేని ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో సావిత్రికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ దిగ్గజాలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది మహా నటి సావిత్రి. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్, అక్కినేని పాత్రలు వున్నాయి. అందులో ఎవరు కనిపిస్తే బాగుంటుంది అనే విషయంలో యూనిట్ సభ్యులు తర్జన భర్జనలు పడుతున్నారు. ఎన్టీఆర్ పాత్రకి జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని పాత్రకు నాగ చైతన్యలను తీసుకుంటే బాగుంటుందని అశ్వనీదత్ భావిస్తున్నాడట. 
 
ఈ విషయాన్ని చైతు, ఎన్టీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, చైతూలు కలసి ఓ సినిమాలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. గుండమ్మ కథ రీమేక్ చెయ్యాలన్న ఆలోచన కూడా వచ్చింది. ఐతే ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదు. కానీ ఆ కోరికను సావిత్రి ఇలా తీర్చిందన్న మాట.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments