Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు శిరీష్ కోర్కె తీర్చిన తమన్నా.. ఏంటా కోర్కె?

మెగా కాంపౌండ్‌లో నుంచి వచ్చిన చాల మంది హీరోస్‌లో అల్లు శిరీష్ ఒక్కడు. మెగాస్టార్ చిరంజీవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అల్లుడుగా అల్లు అర్జున్‌కి తమ్ముడిగా అల్లు అరవింద్‌కి చిన్న కొడుకుగా టాలీవుడ్‌లో

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (11:42 IST)
మెగా కాంపౌండ్‌లో నుంచి వచ్చిన చాల మంది హీరోస్‌లో అల్లు శిరీష్ ఒక్కడు. మెగాస్టార్ చిరంజీవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అల్లుడుగా అల్లు అర్జున్‌కి తమ్ముడిగా అల్లు అరవింద్‌కి చిన్న కొడుకుగా టాలీవుడ్‌లోకి ''గౌరవం'' సినిమాతో మెగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. అల్లు శిరీష్ కెరీర్లో ఇప్పటి వరకు అంత పెద్ద హిట్స్ ఏమి రాలేదు. అల్లు అరవింద్ కూడా అల్లు శిరీష్ కెరీర్నీ దారిలో పెట్టడానికి మొదటి నుండి కూడా హిట్ డైరెక్టర్‌ను పట్టుకొని మరి మూవీస్ డైరెక్టర్ చేయించాడు కానీ ఏ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. 
 
కాగా ఇటీవల రిలీజ్ అయిన ''శ్రీరస్తు శుభమస్తు'' మూవీ మాత్రం కొంచెం ఫర్వాలేదు అని అనిపించుకొని మంచి ఫ్యామిలీ టాక్ తెచ్చుకుంది. ఇటీవల ఈ హీరో ఏకంగా మిల్కీ బ్యూటీ తమన్నాతో కలసి తెరని పంచుకొన్నాడు. అలాగని సినిమాలో కాదండోయ్... ఓ బ్రాండ్‌లో తమ్మూతో కలసి శిరీష్ నటించాడు. 
 
ప్రస్తుతం టీవీల్లో వస్తున్న ఓ యాడ్‌లో వీరిద్దరూ జంటగా నటించారు. ఓ షాంపూ ప్రకటనకు చెందిన తెలుగు వెర్షన్‌లో శిరీష్ - తమన్నా కాంబో కనిపించింది. ఇది చూసిన జనాలు.. అబ్బో శిరీష్ మామూలోడు కాదు. ఏకంగా తమ్మూతోనే కానిచ్చేస్తునాడని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

టీలో నిద్రమాత్రలు కలిపి భార్యకు ఇచ్చి భర్త అత్యాచారం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,030 మంది టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ సాయం

కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా కామెంట్స్- ఫైర్ అయిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments