Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ చిత్రం కోసం జుట్లు పట్టుకున్న దిల్ రాజు - మైత్రీ మూవీ మేకర్స్.. ఎవరు గెలిచారు?

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (16:57 IST)
రాంచరణ్, సుకుమార్‌ల కాంబినేషన్‌‍లో ఓ చిత్రం తెరకెక్కనుందని వార్తలు కొంతకాలంగా ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ''తని ఒరువన్'' రీమేక్‌ని ''ధృవ'' అనే టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాంచరణ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాంచరణ్ తదుపరి చిత్రాన్ని సుకుమార్‌తో చేయాలని నిర్ణయించుకున్నాడు.
 
''నాన్నకు ప్రేమతో'' వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ సినిమా అనగానే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాని నిర్మించేందుకు బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. వారెవరో కాదు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ వీరిలో ప్రధానంగా ఉన్నారు.
 
ఇందులో ట్విస్ట్ ఏంటంటే రాంచరణ్ డేట్స్ మైత్రి మూవీస్ వారి దగ్గర ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ తను తర్వాతి చిత్రాన్ని దిల్ రాజుతో చేస్తానని హామీ ఇచ్చాడట. ఈ నేపథ్యంలో ఈ సినిమా నేను అంటే నేను చేస్తాను అని ఇద్దరి మధ్య పెద్ద వార్ జరుగుతోంది. జుట్టులు పట్టుకోవడం ఒకటే తరువాయి. దీంతో ఈ వివాదం మీరే తేల్చుకోండి అంటూ నిర్మాణ సంస్థలకు చరణ్, దర్శకుడు సుకుమార్ వదిలేసి వెళ్లిపోయారట. 
 
ఇద్దరూ చర్చించుకుని ఒక నిర్ణయానికొచ్చారు. నిర్మాత దర్శకుడికి చెల్లించిన అడ్వాన్స్‌ని దిల్ రాజుకి తిరిగి చెల్లించి మైత్రి మూవీస్ వారు దిల్ రాజుని తప్పుకునేలా చేసినట్టు సమాచారం. దాంతో విజయం మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థే రాంచరణ్‌తో నిర్మించనుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments