Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఎమ్మెస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ" ఆడియో రిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా ధోనీ.. స్పెషల్ గెస్ట్‌గా రాజమౌళి

జార్ఖండ్ డైనమైట్ ఎమ్మెస్ ధోనీ జీవిత నేపథ్యంతో "ఎమ్మెస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ" అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ భాషలలో వి

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (14:36 IST)
జార్ఖండ్ డైనమైట్ ఎమ్మెస్ ధోనీ జీవిత నేపథ్యంతో "ఎమ్మెస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ" అనే మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది. మార్కెట్‌లో రిలీజ్‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. రూ.80 కోట్లతో తీసిన ఈ సినిమా విడుదల కాకముందే రూ.60 కోట్లు సంపాదించింది. ఈ మూవీ శాటిలైట్ హ‌క్కుల ద్వారా రూ.45 కోట్లు రాగా.. బ్రాండింగ్‌లో రూ.15 కోట్లు వ‌చ్చాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
ఈ చిత్రంలో సుషాంత్ రాజ్ పుత్ ధోనీ పాత్ర‌లో నటిస్తున్నారు. ఈ సినిమా స‌హ‌జంగా క‌నిపించేందుకు కొన్ని రియ‌ల్ లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించారు. రాంచీలోని ధోనీ ఇల్లు, స్కూలు, ఖ‌ర‌గ్‌పూర్‌లో ధోనీ టీటీగా చేసిన రైల్వే స్టేష‌న్‌ల‌లో చిత్రీక‌రించారు. ''ఎమ్మెస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ'' పేరుతో ఈ సినిమా ట్రైలర్స్‌కు మంచి స్పందన వస్తోంది. మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉండగా యూనిట్ కూడా వెరైటీ ప్రమోషన్స్‌తో ఆడియన్స్‌లో హైప్ తెస్తుంది. 
 
ఈనెల 24న తెలుగులో ఈ చిత్రానికి సంబంధించి ఆడియో వేడుక జరగనుంది. ఈ ఆడియో లాంఛ్‌కి టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానుండగా, దర్శక ధీరుడు రాజమౌళి కూడా స్పెషల్ గెస్ట్‌గా హాజరు కానున్నాడు. ఇప్పటికే ఓ ప్రముఖ ఛానెల్ ఆడియో వేడుకకి సంబంధించిన టిక్కెట్స్‌ని పంపిణీ చేస్తుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments