Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకున్న డిమాండ్‌ను బట్టి చార్జ్ చేస్తా.. ఇందులో తప్పేంటి : రకుల్ ప్రీత్ సింగ్

ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెలుతున్న హీరోయిన్ ఎవరంటే ముందుగా వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్‌లో అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోందీ బ్యూటీ. రకుల్ దక్

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (13:48 IST)
ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెలుతున్న హీరోయిన్ ఎవరంటే ముందుగా వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్‌లో అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోందీ బ్యూటీ. రకుల్ దక్కించుకుంటున్న సినిమాలన్నీ దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలవే కావడం విశేషం. 
 
ప్రస్తుతం ఈ భామ అరడజను ప్రాజెక్టుల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఆకట్టుకునే అందం, చలాకీ మాటతీరు, తనదైన గడుసుదనంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న చిత్రం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'ధ్రువ'. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పెద్ద హీరోలతో నటించినా కూడా రెమ్యునరేషన్ విషయంలో ఆచీతూచీ అడుగులు వేస్తోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. స్టార్ హీరోస్‌తో నటించడానికి అవకాశం వస్తే ఎవరైనా తమ రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేస్తారు. చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలతో నటించే అవకాశం రావడంతో ఈ భామ కూడా భారీగా డిమాండ్ చేస్తుందట. 
 
తాజాగా రెమ్యునరేషన్ గురించి ఆమె మాట్లాడుతూ.. అందరూ నేను తీసుకునే రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను కెరీర్ స్టార్ చేసినప్పుడు కేవలం 6 లక్షలు మాత్రమే తీసుకున్నాను. కానీ ఇప్పుడు నాకున్న డిమాండ్‌ని బట్టి చార్జ్ చేస్తున్నానని చెప్తోంది. ఈ భామ తీసుకునే పారితోషకం ఎంతో తెలుసా..అక్షరాల రూ.6 కోట్లు అని చెప్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక ఇప్పట్లో రకుల్ జోరు ఆపేవాళ్ళు లేరనే చెప్పాలి.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments