Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ‌తో సినిమా అంటేనే ప‌ట్టించుకోని హీరోయిన్లు

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (19:24 IST)
Ravi Teja
ఒక‌ప్పుడు ర‌వితేజ సినిమా అంటేనే హీరోయిన్లు క్యూ క‌ట్టేవారు. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మారాయి. క్రాక్ ముందుకు ఆయ‌నకు స‌రైన హిట్ లేదు. క్రాక్ లో కూడా శ్రుతిహాస‌న్ న‌టించింది. అది కూడా ద‌ర్శ‌కుడు గోపీచంద్ తో వున్న ప‌రిచ‌యం వ‌ల్లే. క్రాక్ త‌ర్వాత ఖిలాడి సినిమా చేయ‌డానికి ఆయ‌న స‌ర‌స‌న పెద్ద పేరున్న హీరోయిన్ల‌ను అనుకున్నార‌ట‌. న‌లుగురు హీరోయిన్ల‌ను ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ సంప్ర‌దించారు. కానీ వారు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించ‌లేదు. క‌నీసం క‌థ కూడా విన‌లేద‌ట‌. ఈ విష‌యం తెలిసిన ర‌వితేజ స‌మ‌యం లేదు మిత్రమా అంటూ.. రంగంలోకి దిగి కొత్త‌వారిని ప‌రిచ‌యం చేయాల‌ని నిర్ణ‌యించారు. 
 
అప్ప‌టికే క‌రోనా వేవ్ వ‌చ్చేసింది. ఇంకోవైపు ర‌వితేజ మ‌రో మూడు సినిమాల్లో బిజీగా వుండాల్సి వ‌చ్చింది. అందుకే ఖిలాడి సినిమాకు   హీరోయిన్ల కోసం ఎందుకు టైం వేస్టు అన‌డంతో మీనాక్షి చౌద‌రి, డింపుల్ ను అప్పుడు అనుకున్నార‌ట‌. త‌మిళంలో వారు చేసిన సినిమాలు చూసి  ఎన్నుకున్నారు. డింపుల్ మంచి డాన్స‌ర్‌. మీనాక్షి ముంబై నేప‌థ్యం. పాత్ర‌ప‌రంగా ఏదైనా చేయ‌డానికి సిద్ధ ప‌డింది. ఇదిలా వుండ‌గా, ర‌వితేజ న‌టిస్తున్న మ‌రో రెండు సినిమాల‌కు ఇంకా హీరోయిన్ల‌ను ఫైన‌ల్ చేయ‌లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments