Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ అల్లుడుకి నటి మెహ్రీన్ షాక్... నేను చేయను... అడ్వాన్స్ తిరిగివ్వను...

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (18:22 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మంచి ఊపు మీదున్న నటి మెహ్రీన్, పులి వాసు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తోంది. ఐతే ఉన్నట్లుండి నిర్మాతకు షాకిచ్చిందట. హీరోను మార్చేసి మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నటించడానికి నేను తేరగా వున్నానా అంటూ మండిపడుతోందట. అసలు విషయం ఏంటయా అంటే.. మెగాస్టార్ చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఇటీవలే ఓ సినిమా స్టార్ట్ అయింది కదా. ఈ చిత్రాన్ని తొలుత సుధీర్ బాబు హీరోగా ప్రియా వారియర్ హీరోయిన్‌గా చేయాలని అనుకున్నారట.
 
ఏమైందో తెలియదు కానీ... ప్రియా వారియర్ ఈ చిత్రాన్ని తను చేయడం లేదని అడ్డం తిరిగిందట. దానితో ఆ పాత్రలో మెహరీన్‌ను తీసుకున్నారట. ఇందుకు గాను ఆమెకు 30 లక్షల పారితోషికం ఇస్తామని ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. అడ్వాన్సుగా రూ. 10 లక్షలు ఇచ్చారట. ఐతే ఎందుకో తెలియదు కానీ సుధీర్ బాబు కూడా తను ఈ చిత్రంలో హీరోగా చేయనని హ్యాండిచ్చాడట. దానితో మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్‌ను సంప్రదించి ఆయన్ని ఓకే చేశారట. 
 
ఈ విషయం తెలిసిన మెహ్రీన్... మీ ఇష్టం వచ్చినట్లు హీరోను మార్చేసి నటించమంటే నటించడానికి నేనేమి తేరగా లేనంటూ మండిపడుతోందట. ముందుగా చెప్పినట్లు కాకుండా ఇలా మార్పులు చేసినందుకు తను నటించననీ, అలాగే తనకు ఇచ్చిన అడ్వాన్సు కూడా తిరిగి ఇవ్వనని అంటున్నట్లు టాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు. ఐతే నిర్మాత మాత్రం... మెహ్రీన్ నటించి తీరాల్సిందేనంటూ పట్టుబడుతున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజం వుందో తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments