మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (18:42 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ను వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయనున్నారు. రామ్ చరణ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. చిరు, చరణ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే... ఆచార్య తర్వాత చిరంజీవి వినాయక్‌తో లూసీఫర్ రీమేక్, మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్ చేయనున్నారు. అయితే.. ఆచార్య తర్వాత వెంటనే ఏ సినిమా చేస్తారనేది సస్పెన్స్‌గానే ఉండేది. 
 
అయితే.. తాజా వార్త ఏంటంటే... ముందుగా డైనమిక్ డైరెక్టర్ వినాయక్‌తో లూసీఫర్ రీమేక్ చేస్తారనుకున్నారు కానీ... మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.
 
ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసారట. ఇంతకీ ఎప్పుడంటారా..? దసరాకి ఈ సినిమా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. చిరంజీవి ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి మెహర్ రమేష్ రెడీగా ఉన్నాడని టాక్. ఈ సినిమా తర్వాత వినాయక్‌తో లూసీఫర్ రీమేక్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించాలి అనుకుంటున్నారు.
 
ఆ తర్వాతే బాబీతో సినిమా ఉంటుంది. ఈ లెక్కన బాబీ చిరంజీవితో సినిమా చేయటానికి చాలా టైమ్ పడుతుంది. ఈలోపు బాబీ వేరే సినిమా చేస్తాడో.. అప్పటివరకు వెయిట్ చేస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments