Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యాన్స్‌ని టెన్షన్లో పడేసిన చిరంజీవి..!

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (10:25 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీ తెలుగు రీమేక్‌లో నటించనున్నట్టు తెలియచేసారు. ఈ మూవీ గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. 
 
అయితే.. ఫస్ట్ టైమ్ చిరంజీవి ఈ సినిమాని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారు అంటే.. సాహో సినిమాతో భారీ బడ్జెట్ మూవీని కూడా బాగా హ్యాండిల్ చేయగలడని నిరూపించుకున్న సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని తెలియచేసారు.
 
 ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు చిరంజీవి ఎనౌన్స్ చేసారు. పవన్ కళ్యాణ్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని తెరకెక్కించిన బాబీ ఎన్టీఆర్‌తో జైలవకుశ, వెంకటేష్, నాగచైతన్యలతో వెంకీమామని తెరకెక్కించారు. 
 
ఈ సినిమాలతో యాక్షన్ మూవీస్‌ని మాస్ మూవీస్‌ని బాగా తెరకెక్కించగలడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ రెండు సినిమాల తర్వాత మెహర్ రమేష్‌తో ఓ సినిమా చేయనున్నట్టు చిరు ప్రకటించారు.
 
 అంతే.. చిరు ప్రకటన చూసి మెగా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే... మెహర్ రమేష్‌ డైరెక్షన్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయ్యింది కానీ.. ఇప్పటివరకు సరైన సక్సెస్ లేదు. 
 
దీంతో ఫామ్ లోని మెహర్ రమేష్‌తో సినిమా చేస్తున్నారని మెగా అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారని టాక్ వినిపిపిస్తోంది. మరి.. చిరు ఇచ్చిన మాటకు కట్టుబడి మెహర్‌తో సినిమా చేస్తారా..? లేక అభిమానులు మెహర్‌తో సినిమా వద్దు అని చెప్పారని సినిమా క్యాన్సిల్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments