Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీలో ఎవరు కోటీశ్వరుడు వ్యాఖ్యాతగా చిరంజీవి... 150 కోసమట...

సినిమాలకు దూరమై, రాజకీయాల్లోకి వెళ్ళి.. టర్న్‌ తీసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి.. 150వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రం టైటిల్‌ ఖైదీనెం.150గా.. పెట్టారు. తమిళ కత్తిరేమీక్‌ అయినా.. రాష్ట్రంలోని కొన్

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (20:36 IST)
సినిమాలకు దూరమై, రాజకీయాల్లోకి వెళ్ళి.. టర్న్‌ తీసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి.. 150వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రం టైటిల్‌ ఖైదీనెం.150గా.. పెట్టారు. తమిళ కత్తిరేమీక్‌ అయినా.. రాష్ట్రంలోని కొన్ని సంఘటనలను చూపించుతూ.. వాటికోసం పోరాడే నాయకుడిగా నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌.. రకరకాల వార్తలు వస్తున్నారు. 
 
ఇంకా అందరికీ చేరువవ్వాలనే ప్లాన్‌లో చిరంజీవి వున్నాడు. అందుకే బుల్లితెరను ఎంచుకున్నాడు. ఇటీవలే స్నేహితుడు, బిజినెస్‌ పార్టనర్‌ అయిన నాగార్జునతో భేటీ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం.. 'మా' టీవీలో వచ్చే మీలో ఎవరు కోటీశ్వరుడు.. ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా చిరంజీవి వుంటే బాగుంటుందని డిసైడ్‌ అయ్యారు. దాంతో.. ఇకపై నాగార్జున ప్లేస్‌లో చిరంజీవి రాబోతున్నాడు. 
 
బుల్లితెరను తన స్టార్‌ ఇమేజ్‌ను మరలా పుంజుకునేందుకు వాడుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి. నాగార్జున నిర్వహించిన ఈ కార్యక్రమం సక్సెస్‌ అయింది. ఇకపై చిరంజీవి చేసే కార్యక్రమంతో మహిళలకు, పిల్లలకు దగ్గరై తన 150వ సినిమాకు ఎట్రాక్‌ చేసేందుకు వుపయోగపడుతుందనే ఆలోచనలో వున్నారు.  ఈ గేమ్‌ షో డిసెంబర్‌ 12నుంచి టెలికాస్ట్‌ కానుంది. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్స్‌ను.. విజయదశమి తర్వాత షూట్‌ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments