Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంజయ్ దత్ రెండో భార్యగా అనుష్క శర్మ.. రణ్‌బీర్ సరసన ముచ్చటగా మూడోసారి..మాధురీ?

బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా సంజయ్ దత్ జీవిత ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. సంజయ్ దత్ జీవితంలో వివాదాలు, విజయాలు, జైలు వంటివి సర్వసాధారణమైనాయి. సంచలనమైన అతని జీవిత కథ ఆధారంగా ప్రస

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (20:03 IST)
బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా సంజయ్ దత్ జీవిత ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. సంజయ్ దత్ జీవితంలో వివాదాలు, విజయాలు, జైలు వంటివి సర్వసాధారణమైనాయి. సంచలనమైన అతని జీవిత కథ ఆధారంగా ప్రస్తుతం సినిమా రాబోతోంది. రాజ్‌కుమార్ హిరాణీ ఈ సినిమాని రూపొందించేందు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ ద‌శ‌లో ఉంది. 
 
ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..? ఈ సినిమాలో సంజయ్‌దత్ పాత్రను రణ్‌బీర్ కపూర్ పోషిస్తున్నట్లు తెలిసింది. హీరోయిన్ కూడా ఖరారైనట్లు తెలిసింది. రణబీర్‌కి జంటగా సంజయ్‌దత్‌ రెండో భార్య మాన్యతా దత్‌గా అనుష్క శర్మ నటించనున్నట్లు తెలుస్తోంది. మొదటిభార్య పాత్రలో ఎవరన్నది ఇంకా తెలియాల్సివుంది. ఇకపోతే.. రణ్‌బీర్‌‌తో సంజయ్ సినిమాలో అనుష్క శర్మ నటిస్తే ముచ్చటగా మూడోసారి అవుతుంది.
 
మరోవైపు.. మాధురీ దీక్షిత్, సంజయ్ దత్‌లు 90లలో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఖల్ నాయక్ సినిమా సందర్భంగా సంజయ్, మాధురిలపై అప్పట్లో బోలెడు పుకార్లు కూడా వినిపించాయి.  అయితే ఆమె వాటిని ఖండించలేదు.. అవునని చెప్పలేదు. తాజాగా సంజయ్ దత్ బయోపిక్‌పై సినిమా రెడీ కానుండటంతో ఈ చిత్రంలో మాధురీ దీక్షిత్‌తో సంజయ్ సంబంధాలను తెరపై చూపిస్తారా అంటూ సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
కానీ దీనిపై మాధురితో ఎలాంటి చర్చలు జరపకూడదని.. ఆమె ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితం గడుపుతుండగా.. ఆ పాత విషయాలన గుర్తు చేయొద్దని అన్నాడట సంజయ్. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments