Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఘవ లారెన్స్‌కు హ్యాట్సాఫ్.. 130వ చిన్నారికి గుండె శస్త్ర చికిత్స

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ ఉదారత హృదయం కలవాడనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రస్టుల పేరిట సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే లారెన్స్.. పేదలకు ఎంతగానో సాయపడుతున్నాడు.

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (18:29 IST)
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ ఉదారత హృదయం కలవాడనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రస్టుల పేరిట సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే లారెన్స్.. పేదలకు ఎంతగానో సాయపడుతున్నాడు. చెన్నైని ముంచెత్తిన వరదలకు రాఘవ లారెన్స్ స్పందించిన తీరు హర్షణీయం.
 
అలాగే పేద చిన్నారులకు వైద్య సాయం చేయడంలో లారెన్స్‌ ముందుంటాడు. ఇప్పటికే 129 మందికి పైగా చిన్నారుల‌కు గుండె శస్త్ర చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు.

తాజాగా అభినేష్ అనే మరో చిన్నారికి గుండె ఆపరేషన్‌ చేయించ‌డం కోసం రాఘవ లారెన్స్ ఆర్థిక‌ సాయం చేశారు. దీంతో రాఘవ లారెన్స్ 130 మంది చిన్నారులకు వైద్యం కోసం ఆర్థిక సాయం చేసినట్లైంది. ఇక సామాజిక స్పృహ కలిగిన రాఘవ లారెన్స్.. వికలాంగ, అనాథాశ్రమాలను నెలకొల్పి ఎంతోమందికి కొత్త జీవితాలను ఇస్తున్నాడు. 
 
ఇంకా ఎంతో మందిని దత్తత తీసుకుని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. అంతే కాక తన కన్నతల్లిపై ఎన‌లేని ప్రేమ‌ను క‌న‌బ‌రిచే లారెన్స్.. ఆమె కోసం ఓ గుడిని కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ ఆలయంలో తన తల్లి విగ్రహాన్ని కూడా త్వరలోనే ప్రతిష్టించనున్నాడు.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments