Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జై లవ కుశ' కంటే 'స్పైడర్'కే భారీ కలెక్షన్లు...

గత నెలలో దసరా పండుగ సందర్భంగా కేవలం వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ ఒకటికాగా, మరొకటి ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన స్

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (12:56 IST)
గత నెలలో దసరా పండుగ సందర్భంగా కేవలం వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ ఒకటికాగా, మరొకటి ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన స్పైడర్. ఈ రెండు చిత్రాలు కేవలం వారం రోజుల వ్యవధిలో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 
 
బాబీ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్ నిర్మాతగా జూనియర్ ఎన్‌టిఆర్ నటించిన సినిమాపై ముందు నుంచీ అభిమానులకు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉందని అభిమానులు భావించారు. ప్రపంచవ్యాప్తంగా 'జై లవ కుశ' భారీగా కలెక్షన్లు సాధించిందని ఆ సినిమా యూనిట్ తెలిసింది.
 
ఆ తర్వాత రిలీజైన్ "స్పైడర్" సినిమా కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. వరుస విజయాల డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్.. మహేష్‌ బాబు నటించిన సినిమా కావడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడం ఖాయమనుకున్నారు. కానీ సినిమా కాస్త యావరేజ్‌గా మారిపోయింది. అయితే కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. "జై లవ కుశ''ను మించేసింది. కేవలం మూడురోజుల్లోనే 'జై లవ కుశ'కు రూ.50 కోట్లు కలెక్షన్లు రాగా 'స్పైడర్' సినిమాకు రూ.52 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటికీ ఈ రెండు సినిమాల్లో 'స్పైడర్'‌కే కలెక్షన్ల వర్షం కురుస్తున్నాయట.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments