మహేష్‌ - ఎన్టీఆర్ భారీ మల్టీస్టారర్, బడా ప్రొడ్యూసర్ భారీ స్కెచ్..! (video)

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:13 IST)
ఎన్టీఆర్-మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో ఓ భారీ చిత్రం నిర్మించాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు మెగా ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. మహేష్ బాబుకి గతంలో కథ చెప్పించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియలేదు.
 
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజా వార్త ఏంటంటే... మహేష్ బాబు - ఎన్టీఆర్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ నిర్మించాలి అనుకుంటున్నారట. మహేష్‌ - ఎన్టీఆర్ కలిసి నటించేందుకు ఓకే చెప్పారట. దీంతో అల్లు అరవింద్… వీరిద్దరికి సెట్ అయ్యే కథ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు అని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.. టాప్ రైటర్స్ ఈ భారీ మల్టీస్టారర్ స్టోరీ కోసం కసరత్తు చేస్తున్నారని తెలిసింది.
 
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. రాజమౌళితో చేస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
 
ఇక మహేష్‌ బాబు విషయానికి వస్తే... సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నారు. ఈ క్రేజీ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన డా.కె.ఎల్. నారాయణ నిర్మించనున్నారు.
 
 మహేష్‌ - ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత మల్టీస్టారర్ మూవీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక వాస్తవం అయితే...
 అటు ఘట్టమనేని అభిమానులకు ఇటు నందమూరి అభిమానులకు పండగే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జాతిపిత పేరు తొలగింపు సిగ్గుచేటు... కర్మశ్రీకి మహాత్మా గాంధీ పేరు : మమతా బెనర్జీ

రూ.15 వేల కోట్ల భూమి తెలంగాణ సర్కారుదే : సుప్రీంకోర్టు తీర్పు

ఐ బొమ్మ రవికి 12 రోజుల కస్టడీ విధించిన నాంపల్లి కోర్టు... మొత్తం లాగేయాలని..?

ఆపరేషన్ సిందూరా మజాకా.... భవనం మొత్తం టార్పాలిన్ కప్పిన పాకిస్థాన్

పాత కారుతో రోడ్డెక్కారో రూ.20 వేలు అపరాధం ... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

2035 నాటికి భారతదేశాన్ని తలసేమియా రహితంగా మార్చడమే లక్ష్యం

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments