Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ బాబుకి ఆ ముగ్గురులో విలన్ ఎవరు..? (video)

Advertiesment
మహేష్ బాబుకి ఆ ముగ్గురులో విలన్ ఎవరు..? (video)
, గురువారం, 16 జులై 2020 (13:34 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ తర్వాత చాలా కథలు విని ఫైనల్‌గా గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పడం తెలిసిందే. ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో మహేష్ సరసన క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనుంది. ఈ మూవీని అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
కరోనా లేకపోతే ఈపాటికే సెట్స్ పైకి వెళ్లేది. అయితే... షూటింగ్స్‌కి పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు షూటింగ్ చేయలేని పరిస్థితి. ఇదిలా ఉంటే... ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఇందులో మహేష్‌ బాబుకి దీటుగా విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నారని తెలిసింది. 
 
అయితే.... కన్నడ నటులు ఉపేంద్ర, సుదీప్, అరవింద్ స్వామిలను సంప్రదిస్తున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురిలో ఒకరిని ఈ మూవీలో విలన్ పాత్రకు ఎంపిక చేస్తారని అంటున్నారు. అయితే... ఇంతవరకు ఎవరినీ ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతో ఈ క్రేజీ మూవీలో విలన్ పాత్రను పోషించే అవకాశం ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరి... ఉపేంద్ర, సుదీప్, అరవింద స్వామి.. ఈ ముగ్గురిలో ఎవర్ని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔను.. నిజమే.. వకీల్ సాబ్‌తో కలిసి నడుస్తున్నా : శృతిహాసన్ (Video)