Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంబీ బ్యానర్‌పై చిన్న బడ్జెట్ సినిమాలు.. డైరెక్టర్ల కోసం వేట

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (11:45 IST)
సూపర్ స్టార్ మహేష్ నిర్మాణ రంగంలో సత్తా చాటేందుకు ఎంబీ అనే బ్యానర్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యాడ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్, మల్టీఫ్లెక్స్‌ల్లో పెట్టుబడులు చేస్తుంటాడు. తాజాగా నిర్మాణ సంస్థలో వరుసగా సినిమాలు చేసే దిశగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ బ్యానర్‌కి సంబంధించిన వ్యవహారాలు మహేష్ భార్య నమ్రత చూసుకుంటుందనే సంగతి తెలిసిందే. 
 
అయితే ఇప్పుడు ఈ బ్యానర్‌పై వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలా అని భారీ బడ్జెట్ సినిమాలు కాదు.. చిన్న బడ్జెట్‌తో సినిమాలు చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం డైరెక్టర్ల కోసం వేట మొదలెట్టారట. రెండు, మూడు కోట్ల బడ్జెట్‌లో మంచి సినిమాలు తీయగలిగే దర్శకులకు అవకాశాలు ఇవ్వాలని నమ్రత ఆలోచిస్తున్నారట. 
 
ఈ మధ్య కాలంలో చిన్న బడ్జెట్‌లో వచ్చిన చాలా సినిమాలు ఘన విజయాలను నమోదు చేశాయి. 'ఆర్ ఎక్స్ 100', 'చిలసౌ' వంటి సినిమాలు ఇదే కోవలోకి వస్తాయి. గీతా ఆర్ట్స్ కూడా చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది. 
 
ఇదే మంత్రాన్ని ప్రస్తుతం మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా ఫాలో అవ్వాలనుకుంటున్నారట. ఇందులో భాగంగా ఎంబి బ్యానర్‌పై కూడా సినిమాలు తీయాలని ఆలోచిస్తున్నారు. మరి నమ్రత ఐడియాలు ఏమేరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments