Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు మూవీ కోసం.. మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (15:10 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. ఆ తర్వాత రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరిగింది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ మూవీలో చరణ్‌ కీలక పాత్ర పోషించనున్నాడు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. చరణ్‌ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉండడం.. ఒకవేళ చరణ్‌తో ఈ సినిమా చేస్తే.. ఆర్ఆర్ఆర్ తర్వాత రిలీజ్ చేయాల్సి ఉండడంతో చరణ్‌ పాత్రను వేరే వాళ్లతో చేయాలని ఫిక్స్ అయ్యారు.
 
ఎవరైతే బాగుంటారా అని ఆలోచించి ఫైనల్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే.. బాగుంటుంది అనుకోవడం.. మహేష్‌ బాబుని కలిసి కొరటాల కథ చెప్పడం.. మహేష్ ఓకే అనడం జరిగిందని టాలీవుడ్ టాక్. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు.. కలిసి ఒక సినిమాలో నటించడం.. ఈ కాంబినేషన్‌ని అసలు ఊహించలేదు. అటు మెగా అభిమానులు కానీ, ఇటు మహేష్ అభిమానులు కానీ.. ఊహించి ఉండరు. అలాంటి కాంబినేషన్ సెట్ అయ్యింది. 
 
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మహేష్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? ఎంత నిడివి ఉంటుంది..? అనేది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం... మహేష్ క్యారెక్టర్ నిడివి దాదాపు నలభై నిమిషాలు ఉంటుందని తెలిసింది. మహేష్‌ ఈ సినిమాలో నటించడానికి ఓకే అన్న తర్వాత కథలోను, ఆయన క్యారెక్టర్‌లోను మార్పులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

మహేష్‌.. కొరటాల డైరెక్షన్లో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల్లో నటించారు. కొరటాలపై మహేష్‌ బాబుకి బాగా నమ్మకం ఎక్కువ. తనని బాగా చూపిస్తాడనే నమ్మకం.. దీనికితోడు అతని క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం మహేష్ బాబుకి నచ్చడంతో ఓకే చెప్పాడని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది.
 
ఈ సినిమాలో ఈ నలభై నిమిషాల నిడివి గల క్యారెక్టర్ చేయడానికి మహేష్‌ బాబుకి భారీగా 40 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మహేష్‌ ఒక సినిమాలో నటించడానికి 50 కోట్లు తీసుకుంటున్నారు. అలాంటిది 40 నిమిషాల గల క్యారెక్టర్ చేయడానికి 40 కోట్లు అంటే భారీ ఆఫరే అని చెప్పచ్చు.

ఈ క్యారెక్టర్ చేయడానికి 40 రోజులు డేట్స్ ఇచ్చారని... మే నెలాఖరున నుంచి మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఆ రోజు చిరు అభిమానులకు, మహేష్ అభిమానులకు పండగే.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments