Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బ్రహ్మోత్సవం' చిత్రం కోసం 100 రకాల దుస్తులు వాడిన ప్రిన్స్ మహేష్

Webdunia
బుధవారం, 18 మే 2016 (09:19 IST)
హీరో మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివ దర్శకుడు కాంబినేషన్‌లో తయారైన చిత్రం "బ్రహ్మోత్సవం''. పివిపి బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత నటిస్తున్నారు. ఈనెల 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇకపోతే ఈ సినిమాలో విజయవాడ కుర్రాడిగా కనిపించడానికి మహేష్ బాబు కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
అంతేకాకుండా ఈ బ్రహ్మోత్సవంలో మహేష్‌ని అందంగా డిఫరెంట్ లుక్‌తో చూపించడానికి డైరెక్టర్ కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడట. ఈ సినిమాలో సింపుల్‌గా ఉండే కాస్ట్యూమ్స్ మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. దీనికోసం నిర్మాతలు చాలానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్నికాస్ట్యూమ్స్ మార్చారో తెలిస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే. 
 
అదేమిటంటే… ఈ సినిమా కోసం మహేశ్ దాదాపు 100 కాస్ట్యూమ్స్ మార్చాడట. ఈ విషయాన్ని మహేశ్ స్టైలిష్ట్‌ అక్షయ్ స్వయంగా వెల్లడించాడు. సాధారణంగా అగ్రహీరో సినిమా అంటే 25 నుండి 30 కాస్ట్యూమ్స్ మార్చితేనే గొప్పగా అనుకోవచ్చు. అలాంటిది ప్రిన్స్ 100 కాస్ట్యూమ్స్ మార్చాడంటే నిర్మాత ఈ సినిమాను ఎంత భారీగా తెరకెక్కించాడో ఇట్టే అర్థమవుతోంది. ఈ కాస్ట్యూమ్స్‌కే సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసి ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కాస్ట్యూమ్స్ విషయంలోనే ఇంత భారీగా ఆలోచించారంటే సినిమాను ఇంకెంత భారీగా  తీర్చిదిద్దారో తెలియాలంటే ఈ నెల 20 వరకు వేచియుండక తప్పదు మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments