Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ ఛాన్స్ కొట్టేసిన మహేష్ బాబు

‘జనతా గ్యారేజ్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నకొరటాల శివ తన తరువాతి ప్రాజెక్టును రామ్ చరణ్‌తో పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకున్నాడు. మరోవైపు కొరటాలతో సినిమా చేయడానికి రామ్ చరణ్ మరింత ఉత్సాహం చూపించాడు. అయితే, ‘జనతా’ పూర్తయిన వెంటనే తన ప్రాజెక్టును ప్రారంభించ

Webdunia
బుధవారం, 20 జులై 2016 (20:13 IST)
‘జనతా గ్యారేజ్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నకొరటాల శివ తన తరువాతి ప్రాజెక్టును రామ్ చరణ్‌తో పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకున్నాడు. మరోవైపు కొరటాలతో సినిమా చేయడానికి రామ్ చరణ్ మరింత ఉత్సాహం చూపించాడు. అయితే, ‘జనతా’ పూర్తయిన వెంటనే తన ప్రాజెక్టును ప్రారంభించాలనుకుంటున్న కొరటాలకు చరణ్ అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో ఈ అవకాశాన్ని మహేశ్ దక్కించుకున్నాడు. 
 
ధృవ పూర్తయిన వెంటనే సుకుమార్‌తో సినిమా ఉండటంతో వచ్చే వేసవి వరకు చరణ్ మరో సినిమా చేసే అవకాశం లేదు. దీనికితోడు కొరటాలతో మరో సినిమా చేయాలని ‘బ్రహ్మోత్సవం’ తరువాత నుంచి భావిస్తున్న మహేశ్.. ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు సమాచారం. 
 
దీనికి సంబంధించి నిర్మాత డీవీవీ దానయ్య, మహేశ్ సమావేశం అయినట్లు, మహేశ్‌కు రెమ్యునరేషన్‌గా రూ.18కోట్లు చెల్లించనున్నట్లు తెలిసింది. మురుగదాస్‌తో సినిమా చేస్తూనే ఈ సినిమా కూడా చేయాలని, దీంతో వచ్చే ఏడాది వెంటవెంటనే రెండు సినిమాలు విడుదల చేయాలనేది మహేశ్ ప్లాన్‌గా ఫిలింనగర్‌లో చెప్పుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments