Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కత్తిలాంటోడు'కు బుర్రా సాయిమాధవ్ మాటల చాన్స్

చిరంజీవి 150వ చిత్రం కత్తిలాంటోడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సెట్స్ మీది ఉన్న సంగతి విదితమే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేసే వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుం

Webdunia
బుధవారం, 20 జులై 2016 (19:07 IST)
చిరంజీవి 150వ చిత్రం కత్తిలాంటోడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సెట్స్ మీది ఉన్న సంగతి విదితమే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేసే వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. “రావడం కొంచెం లేటు అవ్వొచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా” అని గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాణ్ రాజకీయ మనోభావాన్ని డైలాగ్స్ ద్వారా చెప్పించిన మాటల రచయిత, తెనాలి కుర్రోడు బుర్రా సాయి మాధవ్‌కు ఈ చిత్రానికి మాటలు రాసే మహా అవకాశం దక్కింది.
 
వినాయక్ సినిమా అంటే సాధారణంగా ఆకుల శివ రచయితగా వ్యవహరిస్తాడు. కామెడీతో పాటు హీరోయిజాన్ని చూపించే మాస్ సన్నివేశాలకు మాటలు రాయటంలో ఆకుల శివ స్పెషలిస్ట్. కానీ ఆయనిప్పుడు పవన్ ‘కడప కింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు మాటల రచయిత సుపరిచితుడైన సాయి మాధవ్ బుర్రా.. గోపాల గోపాల సినిమాతో మెగా కాంపౌడ్ లోకి అడుగుపెట్టారు. 
 
ఆయన మాటల్లో సామాజిక అంశాలతో పాటు, సందేశాలు కూడా వినిపిస్తుండటంతో చిరు పిలిచి మరి అవకాశం ఇచ్చారట. అలా సాయి మాధవ్ రాసిన మాటలు, చిరంజీవి 150 సినిమాలోని కీలక సన్నివేశాల్లో వినిపించనున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments