Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్ చెప్పులు పట్టుకున్నా లేదు... బ్రహ్మోత్సవం బోల్తా... పీవీపి 50% ఆఫర్... అవునా...?

శ్రీమంతుడు చిత్రంతో టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన మహేష్ బాబు... తాజాగా నటించిన బ్రహ్మోత్సవం మొదటిరోజే డబ్బా చిత్రం అంటూ ప్రేక్షకులు నొసలు చిట్లించారు. కనీసం నాలుగైదు వారాలైనా గట్టిగా ఆడుతుందనుకున్నా ఆ దాఖలాలు కనిపించడంలేదు. వేసవి శెలవుల్లో విడుదలయ

Webdunia
సోమవారం, 23 మే 2016 (14:55 IST)
శ్రీమంతుడు చిత్రంతో టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన మహేష్ బాబు... తాజాగా నటించిన బ్రహ్మోత్సవం మొదటిరోజే డబ్బా చిత్రం అంటూ ప్రేక్షకులు నొసలు చిట్లించారు. కనీసం నాలుగైదు వారాలైనా గట్టిగా ఆడుతుందనుకున్నా ఆ దాఖలాలు కనిపించడంలేదు. వేసవి శెలవుల్లో విడుదలయిన ఈ బ్రహ్మోత్సం చిత్రానికి బ్రహ్మాండంగా కలెక్షన్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి అలా లేదని రెండో రోజుకే తేలిపోయింది. 
 
ఇంటర్వెల్ బ్యాంగ్ వరకూ ఏదో అలా లాక్కెళ్లిన అడ్డాల... ఆ తర్వాత మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. హీరోను పనిపాటలేకుండా ఎటెటో తిప్పేశాడు. కాశ్మీరు, నాగ్ పూర్, హరిద్వార్.... ఇలా పుణ్యక్షేత్రాలను తీసుకెళ్లాడు. కానీ అది సినిమా అనే మాట మరిచినట్లున్నాడనే ఘాటు వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో మహేష్ బాబుతో చెప్పులు పట్టుకునే సన్నివేశం పబ్లిసిటీకి బాగా పనికివచ్చిందేమో కానీ ఈ చిత్రాన్ని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు చెప్పులు లేనివారుగా మారిపోయారనే వార్తలు వస్తున్నాయి. 
 
చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకు కొన్నవారంతా ఇపుడేం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారట. విషయం తెలుసుకున్న చిత్ర నిర్మాత పొట్లూరి... డిస్ట్రిబ్యూటర్లను తనవంతు ఆదుకుంటానని వర్తమానం ఇచ్చచినట్లు చెప్పుకుంటున్నారు. 50 శాతం మేర నష్టాన్ని పూడ్చుతానని చెప్పినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments