Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలితో పోటీపడే స్పైడర్ బిజినెస్: మొత్తం రైట్స్ రూ.200 కోట్లు పలికిందా?

బాహుబలి సినిమాతో స్పైడర్ బిజినెస్ పోటీ పడుతోంది. మహేష్ బాబు - రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రం ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని

Webdunia
గురువారం, 27 జులై 2017 (11:06 IST)
బాహుబలి సినిమాతో స్పైడర్ బిజినెస్ పోటీ పడుతోంది. మహేష్ బాబు - రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రం ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన మురుగదాస్, మహేష్‌ బర్త్ డేకి టీజర్ లేదంటే ట్రైలర్‌ని విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. 
 
స్పైడర్ తప్పకుండా రికార్డుల ప్రభంజనం సృష్టిస్తుందని సినీ జనం అప్పుడే జోస్యం చెప్తున్నారు. బాహుబలితో స్పైడర్ పోటీ పడినా ఆశ్చర్యనక్కర్లేదని తెలుస్తోంది. ఎందుకంటే.. దక్షిణాదిన భారీ ప్రొడక్షన్ సంస్థగా పేరుగావించిన లైకా ప్రొడక్షన్స్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న స్పైడర్ చిత్ర రైట్స్ దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2.0 వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా సంస్థ ఆ మధ్య వచ్చిన చిరు 150వ చిత్రం ఖైదీ నెం 150 మూవీకి కూడా నిర్మాతలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు స్పైడర్ చిత్ర తమిళ రైట్స్ కోసం ఈ సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది.   
 
ఈ క్రమంలో  స్పైడర్ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూ.90 కోట్ల వరకూ తెచ్చిపెడుతుండగా.. తమిళ వెర్షన్ హక్కులను లైకా ప్రొడక్షన్స్ వారు రూ. 23 కోట్లకి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక హిందీ .. మలయాళ వెర్షన్స్‌కి సంబంధించిన హక్కులు రూ.25 కోట్లవరకూ పోయే అవకాశాలు వున్నాయట. అన్ని భాషలకి సంబంధించిన శాటిలైట్ రైట్స్ రూ.26 కోట్లవరకూ వచ్చాయని అంటున్నారు. ఆడియోతో పాటు మిగతా హక్కులను కలుపుకుంటే రూ. 200 కోట్ల వరకూ స్పైడర్ బిజినెస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments